‘మీర్జాపూర్ 3’రిలీజ్ డేట్ ఫిక్స్..ఎప్పుడంటే... ?
ఈ రెండు సీజన్లకు రికార్డుస్థాయిలో వ్యూవర్ షిప్ వచ్చింది. దీంతో మోస్ట్ పాపులర్ ఇండియన్ వెబ్ సిరీస్‍గా మీర్జాపూర్ నిలిచింది. మీర్జాపూర్ 3వ సీజన్ కూడా సిద్ధమవుతోంది.

క్రైమ్, థ్రిల్లర్ యాక్షన్ వెబ్ సిరీస్‌లను మన వాళ్లు తెగ ఆదరిస్తున్నారు. అలా ఎక్కువమందికి నచ్చిన వెబ్ సీరిస్ లలో ఒకటి ‘మీర్జాపూర్’. పంక్ త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్, శ్వేత త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్‌ను కరణ్ అన్షుమన్, గుర్మీత్ సింగ్‌లు తెరకెక్కించారు. ఇప్పటికే ‘మీర్జాపూర్-1,2’తెరకెక్కింది. ఈ రెండు సీజన్లకు రికార్డుస్థాయిలో వ్యూవర్ షిప్ వచ్చింది. దీంతో మోస్ట్ పాపులర్ ఇండియన్ వెబ్ సిరీస్‍గా మీర్జాపూర్ నిలిచింది. అయితే, మీర్జాపూర్ 3వ సీజన్ కూడా సిద్ధమవుతోంది. మూడో సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దానిపై ఓ అప్‌డేట్ వచ్చింది. ‘మీర్జాపూర్ 3’ (Mirzapur 3)ఓటిటి రిలీజ్ డేట్ త్వరలోనే ఇవ్వబోతున్నట్లు అమేజాన్ ప్రకటించింది. అందుతున్న సమాచారం మేరకు క్రిస్మస్,న్యూ ఇయర్ కానుకగా ...ఈ సీరిస్ స్ట్రీమింగ్ అవుతుందని తెలుస్తోంది. ఈ మేరకు బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు.
తొలి సీజన్‌లో గుడ్డు(అలీ ఫజల్) అత్యంత ప్రియమైన తమ్ముడు బబ్లూ(విక్రాంత్), భార్య శ్వేత(శ్రియ పిల్గోంకర్)లను మున్నా(దివ్యేందు శర్మ) ఎలా నాశనం చేశాడన్న కథతో సాగింది. రెండో సీజన్ లో ప్రపంచంలో ప్రజలు రెండుగా ఎలా విడిపోయారు? అన్న విషయాన్ని గుడ్డు వివరిస్తూ కనిపించాడు. ఒకరు బతికున్న వారు.. మరొకరు చనిపోయిన వారు కాగా, మూడో కేటగిరీ కూడా ఉందని, వాళ్లు గాయపడి ఉన్నారని చెప్పుకొచ్చాడు. గుడ్డు తన ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడన్న దాన్ని ఈ సిరీస్‌లో చూపించారు.
ఈ సిరీస్‌ను గుర్మీత్ సింగ్, మిహిర్ దేశాయ్‌లు తెరకెక్కిస్తున్నారు. ఎక్సెల్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రితేశ్ సిద్వానీ నిర్మిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని మీర్జాపూర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్ తొలి సీజన్ 2018 నవంబరు 16న విడుదలైంది. పంకజ్ త్రిపాఠి, శ్వేతా త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్, శ్రియ పిల్గోంగర్, హర్షిత గౌర్ తదితరులు నటించిన ఫస్ట్ సీజన్‌కు మంచి స్పందన లభించింది. దానికి కొనసాగింపుగా 2020 అక్టోబరు 23న రెండో సీజన్ విడుదలైంది. మూడో సీజన్ వచ్చే నెలలో విడుదల కానుంది. ఈ సిరీసే కాదు గుడ్డూ భయ్యాగా అలీ ఫజల్ కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.