Asianet News TeluguAsianet News Telugu

థియేటర్లు మూసేయడం లేదు.. వదంతులు నమ్మకండిః మంత్రి తలసాని స్పష్టం

కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో థియేటర్లు మూతబడతాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పందించారు. థియేటర్లు మూసేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు.

minister talasani srinivas yadav clarity on theatres closing arj
Author
Hyderabad, First Published Mar 24, 2021, 1:38 PM IST

కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో థియేటర్లు మూతబడతాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పందించారు. థియేటర్లు మూసేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. థియేటర్లు మూసేస్తారనే వదంతులు నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు. ఈ వార్తలను మంత్రి ఖండించారు. కోవిడ్‌ నిబంధనల ప్రకారం థియేటర్లు రన్‌ అవుతాయని పేర్కొన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. 

తెలంగాణలో థియేటర్లు మళ్లీ బంద్‌ చేసే అవకాశం ఉందని, ఈ మేరకు  వైద్య, ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు వార్తలొచ్చాయి. ఆలస్యం చేస్తే మరింత ముప్పు ఖాయమంటూ హెచ్చరించినట్టు, అలాగే థియేటర్లు పూర్తిస్థాయిలో మూసివేత సాధ్యం కాకుంటే సగం సీట్లు (50%) మాత్రమే నింపుకునేలా నిబంధనలు విధించాలని సూచించినట్టు తెలిసింది.  తెలంగాణలో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే చేయి దాటిపోయే ప్రమాదం ఉందని  వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారని,  వరుసగా కొత్త సినిమాలు విడుదలవుతుండటంతో థియేటర్లు 90 శాతంపైగా నిండిపోతున్నాయని, ప్రేక్షకులు మాస్కులు ధరించకుండా పక్క పక్క సీట్లతో కూర్చోవడం వల్ల ప్రమాద తీవ్రత పెరుగుతోందన వైద్య శాఖ పైగా తలుపులన్నీ మూసివేసి ఏసీ వేస్తుండటంతో కేసులు భారీగా పెరుగుతాయని ప్రతోపాదనలో వైద్య ఆరోగ్య శాఖ పేర్కొందట. 

ఈ వార్తలపై తాజాగా మంత్రి స్పందిస్తూ థియేటర్లు మూసేసేప్రసక్తి లేదని, ఇప్పటికే చిత్రపరిశ్రమ చాలాఇబ్బందులు పడిందని, కరోనా టైమ్‌లో చాలా మంది ఉపాధి కోల్పోయారని, అందుకు ప్రభుత్వం కూడా కొంత వరకు ఆదుకుందని తెలిపింది. కాకపోతే ఇప్పుడు కరోనా నిబంధనల ప్రకారం థియేటర్లు రన్‌ అవుతాయని పేర్కొంది. 

Follow Us:
Download App:
  • android
  • ios