టాలీవుడ్ లో చాలా కాలంగా వివాదం అవుతూ వస్తోన్న సమస్య ఇండస్ట్రీకి పెద్ద ఎవరు..? ఈవిషయంలో చాలా కాలంగా కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. ఇక రీసెంట్ గా టాలీవుడ్ పెద్ద ఎవరూ అన్న విషయాన్ని తేల్చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.
గతంలో టాలీవుడ్ కు అందగా,పెద్ద దిక్కులా ఉండేవారు దర్శకుడు దాసరి నారాయణరావు. ఆయన చనిపోయిన తర్వాత నుంచి తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు ఎవరనే విషయంపై చర్చ నడుస్తోంది. ఇండస్ట్రీలో ఒకరికి ఒకరికి పొంతన లేకపోవడం, అందరూ కలిసి పూర్తి స్థాయిలో ఐకమత్యంగా నిర్ణయాలు తీసుకోలేకపోవడంతో పెద్ద అన్న పోస్ట్ ను తీసుకోవడానికి ఎవరూ ముందు రావడం లేదు.
అయితే టాలీవుడ్ కు మెగాస్టార్ చిరంజీవే పెద్ద దిక్కు అని చాలా మంది ఇండస్ట్రీ పెద్దలు ఇప్పటికే చెప్పారు.కాని ఈ విషయంలో చిరంజీవి క్లారిటీ ఇస్తూ... తాను కేవలం సినిమా బిడ్డను మాత్రమేనని... ఇండస్ట్రీకి పెద్ద దిక్కును కాదని స్పష్టం చేశారు. చాలా సందర్భాల్లో ఇదే విషయన్ని స్పస్టంగా చెప్పారు. అయితే ఏపీలో సినిమా టికెట్ ధరల విషయంలో మాత్రం ఆయన చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించారు. అప్పుడు కూడా తాను ఇండస్ట్రీ బిడ్డగా మాత్రమే వచ్చానని క్లియర్ గా చెప్పారు చిరు.
ఇక ఈ విషయంలో మరోమాట లేదు అంటూ.. ఇండస్ట్రీ పెద్ద ఎవరు అన్నదానిపై క్లారిటీ ఇచ్చారు తెలంగాణ మంత్రి. ఈ అంశంపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ... ఇండస్ట్రీకి పెద్ద దిక్కు మెగాస్టార్ చిరంజీవే అని చెప్పారు. ఫిలిం జర్నలిస్టులకు హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అంతే కాదు ఫిలిం జర్నలిస్టులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. గత కొంత కాలంగా మంచు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇండస్టరీ పెద్దగా ఒక దశలో మోహన్ బాబు కూడా ఉండాలని ప్రయత్నం చేశారు. కాని ఈ విషయంలో మెగా మాటే చెల్లుబాటు అయినట్టు తెలుస్తోంది. కాకపోతే మా ఎలక్షన్స్ లో మంచు విష్ణు గెలుపుతో ఇండస్ట్రీ రెండు వర్గాలుగా మారి విమర్షలు చేసుకుంటున్నారు.
