రిలీజ్ అయ్యి రెండు నెలలు అవుతున్నా..అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా పుష్పమ్యానియా గట్టిగా నడుస్తోంది. పుష్ప (Pushpa) పాటలను ఇమిటేట్ చేస్తూ.. రకరకాల వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

రిలీజ్ అయ్యి రెండు నెలలు అవుతున్నా..అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా పుష్పమ్యానియా గట్టిగా నడుస్తోంది. పుష్ప (Pushpa) పాటలను ఇమిటేట్ చేస్తూ.. రకరకాల వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

పుష్ప మ్యానియా మూమూలుగా లేదు. పుష్పసినిమాతోఫస్ట్ టైమ్ పాన్ ఇండియాకు వెళ్ళాడు అల్లు అర్జున్(Allu Arjun). ఫస్ట్ మూవీతోనే దడదడలాడించాడు బన్ని. బన్నీ క్రేజ్.. పుష్ప ఊపు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. పుష్ప మూవీలో అల్లు అర్జున్(Allu Arjun) లా బుజం పైకి లేపి నడిచే ట్రెండ్ అయితే గట్టిగా వైరల్ అయ్యింది. ఇక పొలిటికల్ లీడర్స్ కూడా పుష్ప(Pushpa) పాటలను తమ పార్టీల ప్రచారాలకు వాడుకుంటున్నాయి. ఒక తెలుగు సినిమాకు దేశ వ్యాప్తంగా వస్తున్న క్రేజ్ కు మైండ్ బ్లాక్ అవుతోంది.

Scroll to load tweet…

పొలిటికల్ గా పుష్ప డైలాగ్స్ గట్టిగా పేలుతున్నాయి. రీసెంట్ గా రక్షణ మంత్రి రాజ్ నాత్ సింగ్ ఉత్తరాఖండ్ ఎలక్షన్ ప్రచారంలో పుష్ప(Pushpa) డైలాగ్ వాడారు. పుష్ప మూవీకి సీఎం పుష్కర్ కు పోలిక పెట్టారు. మన సీఎంలో.. పుష్ప మాదిరి ప్లవరు ఉంది ఫైరు ఉంది అన్నారు. ఇక ఉత్తర ప్రదేశ్ ఎలక్షన్స్ లో ఏకంగా పుష్ప(Pushpa) సినిమాలో శ్రీవల్లి పాటను రీమిక్స్ చేసి.. యూపీ గోప్పతనంతో లిరిక్స్ రాసి ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు.

పుష్ఫ క్రేజ్ ఖండాంతరాలు దాటి యూరప్ లోనూ మోత మోగిస్తోంది. రీంట్ గా శ్రీవల్లి పాటను నెదర్లాండ్స్ కు చెందిన ప్రముఖ గాయని ఎమ్మా హీస్టర్స్ అద్భుతంగా ఆలపించి, ఆ వీడియోను యూట్యూబ్ లో విడుదల చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పుష్ప సంగీత దర్శకుడు దేవి శ్రీప్రసాద్ కూడా స్పందించారు. సింగర్ సిద్ శ్రీరామ్ ను ఉద్దేశించి..హేయ్ సిద్ శ్రీరామ్ బ్రో... ఈ పాట రికార్డు చేస్తున్నప్పుడు శ్రీవల్లి ఇంగ్లీష్ వెర్షన్ కూడా చేయాలని మనం అనుకున్నాం కదా... అయితే ఈ పాటకు అద్భుతమైన కవర్ సాంగ్ వచ్చింది... ఇదిగో!" అంటూ ఎమ్మా హీస్టర్స్ పాడిన పాట తాలూకు వీడియోను కూడా పంచుకున్నారు.

YouTube video player

సామన్యనుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ పుష్ప(Pushpa) మ్యానియాలో భాగం అవుతున్నారు. ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్ధి కూడా పుష్పలో బన్నీ సిగ్నేచర్ స్టెప్ వేసి అందరిని ఆశ్చర్య పరిచారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

Scroll to load tweet…

నార్త్ లో ఓ ఆటోపై పుష్ప టైటిల్ వేసుకున్నాడు డ్రైవర్.. అంతే కాదు..పేరుతో పాటు.. ఆటో యాంగిల్ కూడా పుష్పా(Pushpa)లో బన్నీని పోలి ఉండేలా టాప్ వంకరగా మార్చుకుని కనిపిస్తున్న ఫోటో వైరల్ అవుతుంది.

Scroll to load tweet…

మరోవైపు యంగ్ క్రికెటర్స్ నెట్ ప్రాక్టీస్ చేసుకుంటూ పుష్ప(Pushpa) సాంగ్ ను ఇమిటేట్ చేశారు. బ్యాట్ పట్టుకుని శ్రీవల్లి పాటకు లయబద్దంగా స్టెప్పులేసుకుంటూ.. వీడియో చేశారు యంగ్ స్టార్స్. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Scroll to load tweet…

మన దేశంలోని ప్రతీ రాష్ట్రాంలో పుష్ప(Pushpa) మ్యానియా నడుస్తోంది. ఓ పెళ్ళిలో బోజనాలు జరుగుతున్న సందర్భంలో.. క్యూలో ఉన్న బంధువులు.. పుష్ప సాంగ్ కు స్టెప్పులేస్తూ.. బోజనాలు వడ్డించుకుంటున్న సీన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. నెటిజన్లు తెగ చూసేస్తున్నారు.

Scroll to load tweet…

ఇవే కాదు మన రాష్ట్రానికి అస్సలు సంబంధం లేదు అన్నట్టు ఉండే ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్ లో కూడా ఆడియన్స్ ను పుష్ప(Pushpa) గట్టిగానే ఆకట్టుకుంది. అక్కడ ఉన్న ఓ ట్రైబల్ తెగవారు పుష్ప పాటకు వారి సాంప్రదాయ నృత్యం చేసి..ఆకట్టుకున్నారు. పుష్ప(Pushpa) సినిమాకు అల్లు అర్జున్(Allu Arjun) కు తాము ఎంత ఫ్యాన్సో నిరూపించుకున్నారు.

Scroll to load tweet…

ఇక పుష్ప సినిమాకు తమ క్రియేటివిటీతో ట్రిబ్యుట్ ఇచ్చారు మరికొంత మంది. పుష్ప(Pushpa) లోని శ్రీవల్లి పాటను తొలు బొమ్మతో లయబద్దంగా డాన్స్ చేపించి చూపించారు కొంత మంది స్టూడెంట్స్. ఈ వీడియో కూడా అందరిని ఆకట్టుకుంటుంది.

Scroll to load tweet…

అంతే కాదు ఓ మ్యాచ్ లో క్రికెటర్ అవుట్ అయిన తరువాత.. పుష్ప(Pushpa) మూవీలోలా.. తగ్గేదేలే అంటూ.. గడ్డంకింద చేయి పెట్టుకుని అల్లు అర్జున్(Allu Arjun) ను ఇమిటేట్ చేస్తున్న వీడియో కూడా ఆకట్టుకుంటుంది. అంతే కాదు.. అలా చేస్తూనే.. శ్రీవల్లిస్టెప్ కూడా వేశాడు క్రికెటర్.

Scroll to load tweet…

సుకుమర్ డైరెక్షన్ లో ఎర్రచందనం స్మగ్లర్ పుష్ప రాజ్ గా అల్లు అర్జున్(Allu Arjun) బాగా ఆకట్టుకున్నాడు. బన్ని జోడీగా రష్మిక మందన్న శ్రీవల్లి పాత్రలో మెరిసింది. ఈ మూవీ మన తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని భాషల్లో దుమ్ము రేపింది. దాదాపు ప్రపంచ వ్యాప్తంగా 350 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది పుష్ప (Pushpa) మూవీ. ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 మూవీ షూటింగ్ కు రెడీ అవుతున్నారు టీమ్.