వివాదాలు ఎప్పుడూ సెలబ్రిటీలు వెనకే ఉంటాయి. ముఖ్యంగా స్కిన్ షో విషయంలోనే సెలబ్రెటీలు ఎక్కువగా వివాదాల బారిన పడుతుంటారు. అయితే గ్లామర్ వరల్డ్ లో వివాదాలు అన్నవి అతి కామన్.  అప్పట్లో బాలీవుడ్‌ జోడీ మిలింద్‌ సోమన్‌, మధు సప్రే ఓ షూ యాడ్‌ కోసం చేసిన న్యూడ్‌ ఫోటో షూట్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దాన్ని ఇప్పుడు మళ్లీ తీసి సోషల్ మీడియా ద్వారా జనంలోకి వదిలాడు. జనం రెస్పాన్స్ ఎలా ఉందో చూడాలనే ఆలోచనతో ఈ పని చేసినట్లు చెప్తున్నాడు. 

మిలింద్ సోమన్ ..1988 లో మోడల్ గా కెరీర్ మొదలెట్టారు. అప్పటి ఓ మేజర్ నోస్టాలజీ మూవ్ మెంట్ ఇనిస్ట్రాలో షేర్ చేసారు. 54 ఏళ్ల ఈ నటుడు తన బ్లాక్ అండ్ వైట్ మెమరీ తో మరో సారి వార్తలకు ఎక్కారు. 1995లో ఈ యాడ్ తీసారు. ఈ ఫొటో షేర్ చేస్తూ ఇంటర్నెట్ ఎలా స్పందించబోతోందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పాడు. అది ఓ ప్రింట్ యాడ్. అప్పట్లో ఈ యాడ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ యాడ్ పై రెండు కేసులు పడ్డారు. ఈ పాతికేళ్ల నాటి ఫొటో నన్ను ఎప్పుడూ జ్ఞాపకాల్లో పడేస్తుంది. ఆ టైమ్ లో సోషల్ మీడియా, ఇంటర్ నెట్ లేదు. ఉండి ఉంటే ఎలాంటి రియాక్షన్ వచ్చి ఉండి ఉండేదో అంటున్నారు. 
 
 మిలింగ్ సోమన్ 80, 90 దశకాల్లో టాప్ మోడల్ గా ఎదిగారు. మధు సప్రేతో కలిసి ఎన్నో యాడ్స్‌లో నటించారు. ప్రముఖ గాయని అలీషా చినాయ్ రూపొందించిన మేడ్ ఇన్ ఇండియా మ్యూజిక్‌తో భారీగా పాపులారిటీని సంపాదించుకొన్నారు. కామసూత్ర యాడ్‌లో అర్ధనగ్నంగా నటించి అప్పట్లో సంచలనం రేపారు. 53 ఏళ్ల మిలింద్.. తనకంటే వయసులో 26 ఏళ్లు చిన్నదైన అంకితా కోన్వార్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.