Asianet News TeluguAsianet News Telugu

సందీప్ కిషన్ ‘మైఖేల్’ ప్రీ రిలీజ్ కు ప్లేస్, డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్ట్ ఎవరంటే?

యంగ్ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) తాజాగా నటిస్తున్న ఫిల్మ్ ‘మైఖేల్’. పాన్ ఇండియన్ ఫిల్మ్ గా విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ వెడుకకు గ్రాండ్ గా ఏర్పాట్లు చేస్తున్నారు. చీఫ్ గెస్ట్ కూడా రాబోతున్నారు. 
 

Michael movie pre release event details!
Author
First Published Jan 30, 2023, 4:27 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ సాలిడ్ యాక్షన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మాస్ అండ్ యాక్షన్ చిత్రాల్లో నటిస్తున్న ఆయన తాజాగా ‘మైఖేల్’ (Michael) చిత్రంతో థియేటర్లలో అడుగుపెట్టబోతున్నాడు. ఇది పాన్ ఇండియన్ ఫిల్మ్ గా విడుదల కాబోతోంది. రంజిత్ జయకోడి రచన మరియు దర్శకత్వం వహించారు. తమిళ స్టార్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi), నటుడు, దర్శకుడు గౌతమ్ మీనన్ (Gautham Menon) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే నెలలో విడుదల కాబోతున్న ఈ చిత్ర  ప్రచార కార్యక్రమాలను యూనిట్ జోరుగా నిర్వహిస్తోంది. 

అందులో భాగంగా ఇప్పటికే పోస్టర్లు, టీజర్, ట్రైలర్ విడుదల చేసి ఆకట్టుకున్నారు. అప్డేట్స్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. నందమూరి బాలక్రిష్ణ (Balakrishna) విడుదల చేసిన  తెలుగు ట్రైలర్ దూసుకుపోతోంది. సినిమాపై మరింతగా అంచనాలు పెంచేందుకు గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ప్లాన్ చేశారు. హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్ లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈవెంట్ కు నేచురల్ స్టార్ నాని  (Nani) చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నారు. జనవరి 31న సాయంత్రం 6 గంటలకు వేడుక ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఒక అమ్మాయి కోసం హీరో చేసిన విధ్వంసమే  మైఖేల్ గా తెలుస్తోంది. డైలాగ్స్, యాక్షన్స్, రొమాంటిక్ సన్నివేశాలు ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, అనసూయ, వరలక్ష్మి శరత్ కుమార్ వంటి స్టార్ కాస్ట్ నటించడంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. చిత్రానికి  సామ్ సి ఎస్ అద్భుతమైన సంగీతం అందించారు. ఫిబ్రవరి 3న తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Follow Us:
Download App:
  • android
  • ios