యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ - గ్లామర్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘కార్తీకేయ 2’. ఈ మూవీ నుంచి లేటెస్ట్ గా మెలోడీ ట్రాక్ ను రిలీజ్ చేయగా.. క్రేజీ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది.
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddhartha), గ్లామర్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘కార్తీకేయ 2’. ఈ చిత్రం ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధమవుతోంది. దీంతో మేకర్స్ అదిరిపోయే అప్డేట్స్ అందిస్తూ సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నారు. విభిన్న కథాంశాలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్న నిఖిల్ Karthikeya మూవీ కోసం బాగా కష్టపడ్డారు. ఇప్పటికే మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, పోస్టర్స్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేలోడీ సాంగ్ ను వదిలారు.
కార్తీకేయ 2 నుంచి ఫస్ట్ సింగిల్ గా ‘నన్ను నేను అడిగా’ అనే టైటిల్ తో మెలోడీ ట్రాక్ ను వదిలారు. ఈ రొమాంటిక్ సాంగ్ కు క్రిష్ణ మదినేని అద్భుతమైన లిరిక్స్ అందించగా.. సింగర్ ఇన్నో గెంగా గాత్ర దానం చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ కాలా భైరవ క్యాచీ ట్యూన్ ను అందించారు. ‘అడిగా నన్ను నేను అడిగా.. నాకెవ్వరు నువ్వని.. అడిగా నిన్ను నేను అడిగానే.. నిన్నలా లేనని..’ అంటూ సాగే పాట వినసొంపుగా ఉంది. తాజాగా యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఈ సాంగ్ కు సంగీత ప్రియుల నుంచి అనూహ్యా స్పందన లభిస్తోంది.
ఎనర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వస్తున్న కార్తికేయ 2పై అంచనాలు భారీగా ఉన్నాయి. కమర్షియల్ చిత్రాలతో పాటు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొనసాగిస్తూ విజయాలు సొంతం చేసుకుంటున్న క్రేజీ నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బెస్ట్ టెక్నీషియన్స్ తో మంచి అవుట్ పుట్ ను అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ చిత్రంలో ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) నటిస్తోంది. ఆయా పాత్రల్లో అనుపమ్ ఖేర్, శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్, ఆదిత్యా మీనన్, తులసి, సత్య, వైవా హర్ష, వెంకట్ తదితరులు నటిస్తున్నారు. జూలై 22న ఐదు భాషల్లో ఈ చిత్రం రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే అఫిషియల్ ప్రకటించారు. తెలుగుతో పాటు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.
