పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ కెరీర్ లో మంచి హిట్స్ ఉన్నప్పటికీ ఆమెకి టాలీవుడ్ లో సరైన అవకాశాలు మాత్రం రావడం లేదు. ఈ ఏడాది సంక్రాంతికి 'ఎఫ్ 2' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెహ్రీన్ పెద్ద సక్సెస్ అందుకొంది.

ఈ సినిమాలో ఆమె పాత్రకి మంచి పేరొచ్చింది. సాధారణంగా ఇలాంటి సక్సెస్ వస్తే వరుస అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి కానీ మెహ్రీన్ విషయంలో అలా జరగడం లేదు. విజయ్ దేవరకొండ సినిమా తప్ప ఆమె చేతిలో మరో సినిమా లేదు. ఇలాంటి సమయంలో మెహ్రీన్ కి కోలీవుడ్ నుండి అవకాశాలు వస్తున్నాయి. 

అక్కడ స్టార్ హీరో ధనుష్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం వెట్రిమారన్ దర్శకత్వంలో 'అసురన్' సినిమా చేస్తోన్న ధనుష్.. దాన్ని పూర్తి చసి దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'కొడి' సినిమా పెద్ద హిట్ అయింది.

మరోసారి వీరిద్దరి కలయికలో రాబోతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో మెహ్రీన్ కి లీడ్ హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. చాలా కాలానికి ఓ స్టార్ హీరో సినిమాలో నటించే ఛాన్స్ రావడంతో అమ్మడు ఆనందానికి అవధుల్లేవట!