అంటే ఇక్కడ కూడా బోల్డ్ సీన్స్,లిప్ లాక్ లు చేస్తావా?
తెలుగులో కూడా ఓటిటి కంటెంట్ చేస్తానని మీడియా ముఖంగా చెప్పింది మెహ్రిన్. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ మొదలయ్యాయి.

సినిమా పెద్ద తెరపై నుంచి ఓటిటి మార్గం పట్టిన తర్వాత హీరో,హీరోయిన్స్ కు అదో కొత్త ఆదాయ మార్గంగా మారింది. సినిమాలతో పాటు మంచి ఆఫర్ వస్తే అటు దూకేస్తున్నాడు. ఇప్పటికే వెంకటేష్,రానా, నాగచైతన్య, సమంత ,కాజల్ ,తమన్నా ఇలా వరసపెట్టి అందరూ ఓటిటి కంటెంట్ చేస్తున్నారు. అక్కడ సెన్సార్ లేకపోవటంతో అడల్డ్ డైలాగులు,సీన్స్ లతో రెచ్చిపోతున్నారు.
హీరోయిన్స్ అయితే ఓటీటీల్లోకి(OTT) ఎంట్రీ ఇచ్చి బోల్డ్ సన్నివేశాలతో రెచ్చిపోతున్నారు. ఓటీటీకి సెన్సార్ లేకపోవడంతో, సినిమాలకు వచ్చే రెమ్యునరేషన్ ఇక్కడ కూడా వస్తుండటంతో ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్ ఓటీటీలో బోల్డ్ సీన్స్ కి ఓకే చెప్పి దూసుకుపోతున్నారు. తమన్నా ఓటీటీ సిరీస్ లలో రెచ్చిపోయి మరీ బోల్డ్ సీన్స్ లో నటించింది. తాజాగా మెహ్రీన్ కూడా బోల్డ్ సీన్స్ లో నటించింది. ఆ లిస్ట్ లో ఎఫ్ సీరిస్ హీరోయిన్ మెహ్రీన్ కూడా చేరింది. ఆమె నటించిన సుల్తాన్ అఫ్ ఢిల్లీ(Sultan of Delhi) అనే సిరీస్ ఇటీవల హాట్ స్టార్(Hotstar) లోకి వచ్చి సక్సెస్ అయ్యింది. ఇప్పుడు ఆమె తెలుగులో కూడా ఓటిటి కంటెంట్ చేస్తానని మీడియా ముఖంగా చెప్పింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ మొదలయ్యాయి.
సుల్తాన్ అఫ్ ఢిల్లీ సిరీస్ లో మెహ్రీన్ కొన్ని లిప్ లాక్ సీన్స్ తో పాటు, పెళ్లి తర్వాత భర్త ఫోర్స్ చేసే సన్నివేశాల్లో బోల్డ్ గా నటించింది. దీంతో ఈ సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొంతమంది మెహరీన్ పై ఇలాంటి బోల్డ్ సీన్స్ లో నటించినందుకు విమర్శలు చేసారు. అయితే తనపై వచ్చిన విమర్శలకు మెహ్రీన్ సోషల్ మీడియాలో ఫైర్ అయింది. అదంతా గుర్తున్న వాళ్లు...తెలుగులో చేస్తాను అనగానే..ఇక్కడ కూడా అలాంటి హాట్ సీన్స్, లిప్ లాక్ లు చేస్తావా అంటూ కామెంటుతున్నారు. అయితే సోషల్ మీడియాలో ఇలాంటివన్నీ కామన్ కాబట్టి. లైట్.