వరుస సినిమాలతో దూసుకుపోతోంది యంగ్ టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా. స్టార్ హీరోలతో గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్న ఈ స్టార్ హీరోయిన్.. చిల్ అయ్యింది. రీసెంట్ గా నడిరోడ్డుపై చిందులు వేస్తూ.. ఫుల్ గా ఎంజాయ్ చేసింది. 

రీసెంట్ గా ఎఫ్3 మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చింది టాలీవుడ్ ముద్దుగుమ్మ మెహ్రీన్. కాగా నాని హీరోగా తెరకెక్కిన కృష్ణగాడి వీర ప్రేమకథ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ పంజాబీ భామ వరుసగా అవకాశాలు సాధిస్తోంది. కాకపోతే అందులో సక్సెస్ రేటు తక్కుగా ఉంటోంది. ఆ మధ్య సినిమాలు మానేసి పెళ్లి పీటలు ఎక్కాలని చూసింది బ్యూటీ. ఎంగేజ్ మెంట్ వరకూ వెళ్ళి క్యాన్సిల్ అయ్యింది. ఇక తన టైమ్ అంతా.. సినిమాలు కెరీర్ పైనే దృష్ి పెట్టబోతున్నట్టు ప్రకటించిన బ్యూటీ.. హైదరాబాద్ ప్లైట్ ఎక్కేసింది. ఇక్కడే బిజీ బిజీగా గడిపేస్తోంది.

తన పెళ్ళి సంగతి మర్చిపోయిన మెహ్రీన్.. బంధువుల పెళ్లిల్లలో మాత్రం చిల్ అవుతోంది. రీసెంట్ గా తన దగ్గరి బంధువుల పెళ్లి వేడుకల్లో పాల్గోంది హీరోయిన్‌ మెహ్రీన్. సినిమాలతో బిజీ బిజీగా ఉంటూ.. తీరకలేకుండా గడిపిన బ్యూటీ.. కాస్త విరామం దొరకడంతో చిల్ అవుతోంది. ఈ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌లో నిర్వహించిన బారాత్‌లో నడిరోడ్డుపై స్టెప్పులేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. మరో అమ్మాయితో కలిసి తీన్‌మార్ కు ఉత్సాహంగా చిందులేసింది. పెళ్లి బరాత్‌ చేసిన ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది మెహ్రీన్‌. ఈ పోస్ట్‌కు 'పంజాబీ వెడ్డింగ్‌ సీన్స్‌' అనే క్యాప్షన్స్‌ ఇవ్వగా.. ఈ వీడియో అతి కొద్ది సమయంలోనే వైరల్‌గా మారింది. 

View post on Instagram

 ఓ పక్క సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంటూనే మరోపక్క సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటారు హీరోయిన్లు. సినిమా విశేషాలు, వ్యక్తిగత విషయాలు, విహార యాత్రలకు సంబంధించిన పోస్టులు, వీడియోలు పెడుతూ అభిమానులను, ఫాలోవర్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తుంటారు. అంతేకాకుండా ఈ పోస్టులతో మూవీ ప్రమోషన్స్‌ చేస్తూ కొత్త ఫాలోవర్స్‌, సినిమా అవకాశాలను ఆకర్షిస్తున్నారు. తాజాగా ఓ యంగ్‌ హీరోయిన్‌ తను పెట్టిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఎవరా హీరోయిన్‌ అంటే.. ఎఫ్‌3 తో సక్సెస్ జోష్‌లో ఉన్న బ్యూటిఫుల్‌ మెహ్రీన్‌ పిర్జాదా.