హీరోయిన్లు తాము నటించే సినిమాల్లో గ్లామరస్ గా కనిపించాలని అనుకుంటారు. ముఖ్యంగా చనిపోయే క్యారెక్టర్లు దాదాపు ఎవైడ్ చేస్తుంటారు. కానీ టాలీవుడ్ ముద్దుగుమ్మ మెహ్రీన్ మాత్రం ఇలాంటి పాత్రలో నటించడానికి అంగీకరించింది.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా దర్శకుడు శ్రీనివాస్ మామిల్ల 'కవచం' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రేపే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కాజల్, మెహ్రీన్ లు హీరోయిన్లుగా కనిపించనున్నారు.

సినిమాలో కాజల్ మెయిన్ హీరోయిన్ గా కనిపించనుంది. మెహ్రీన్ పాత్ర చిన్నదే అయినప్పటికీ సినిమాకు కీలకమని తెలుస్తోంది. సోలో హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంటున్న మెహ్రీన్ ఈ సినిమాలో చిన్న పాత్ర కోసం పైగా చనిపోయే పాత్రలో నటించడానికి కారణం సినిమా ఫైనాన్షియర్లు.

ఈ సినిమాపై పెట్టుబడి పెట్టిన వ్యక్తులు మెహ్రీన్ కి పరిచయస్తులట. వారు మెహ్రీన్ ని ఈ పాత్ర కోసం సంప్రదించినప్పుడు ఆమె అంగీకరించలేదట. రెమ్యునరేషన్ భారీగా ఆఫర్ చేయడంతో ఆమె ఒప్పుకుందని తెలుస్తోంది. కథ ప్రకారం మెహ్రీన్ మర్డర్ మిస్టరీ చేధించడంతో పాటు కాజల్ కి సంబంధించిన ఓ సస్పెన్స్ కి తెరదించే పాయింట్ తో సినిమా నడుస్తుందని తెలుస్తోంది!