మెహబూబ్‌ ఎలిమినేషన్‌ బిగ్‌బాస్‌4 హౌజ్‌ని కన్నీళ్లతో ముంచెత్తింది. ఆయన ఎలిమినేషన్‌ సభ్యులు జీర్ణించుకోలేక కంటతడి పెట్టారు. దీంతో హౌజ్‌ మొత్తం బరువెక్కింది. నాగార్జున సైతం అలా సైలెంట్‌గా ఉండిపోయాడు. అయితే మెహబూబ్‌ మాత్రం వెళ్తూ వెళ్తూ ఎవరిని బ్యాడ్‌ చేయలేదు. అందరి గురించి చాలా పాజిటివ్‌గా చెప్పాడు. మేల్స్ సభ్యుల్లో ప్రధానంగా అందరిని జిమ్‌ చేయమని చెప్పాడు. అభిజిత్‌, అవినాష్‌కి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. 

తనకు స్విమ్మింగ్‌ రాకపోతే సభ్యులు నేర్పించినట్టు పేర్కొన్నాడు మెహబూబ్‌. సోహైల్‌ ఉంటే తాను ఉన్నట్టే అని, అతను ఉన్నన్ని రోజు తాను కూడా హౌజ్‌లోనే ఉన్నట్టుగా భావిస్తానని తెలిపాడు. అభిజిత్‌పై ప్రశంసలు కురిపించాడు. బాగా గేమ్స్ బాగా ఆడతావని, బాగా కష్టపడతావని, వర్కౌట్స్ చేయమని చెప్పాడు. ఫిజికల్‌ టాస్క్ ల్లో కూడా యాక్టింగ్‌గా ఉండాలని, గెలవాలని చెప్పాడు. లాస్య గురించి చాలా చెప్పాడు. తనకు ఏదీ కావాలన్నా వండి పెట్టిందన్నారు. హారికతో డాన్స్ మిస్‌ అవుతున్నానని అన్నాడు. ఇక అవినాష్‌ హౌజ్‌లో అత్యంత ఎంటర్‌టైనింగ్‌ పర్సన్‌ అని, ఏ మూడ్‌లో ఉన్న తన వద్ద ఉంటే రిలీఫ్‌ అయిపోతామన్నాడు. 

అరియానా చాలా స్ట్రాంగ్‌ అని, ఉన్నది ఉన్నట్టు చెబుతుందని, తను చేసేది రైట్‌ అన్నాడు. అఖిల్‌ స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ అని, నెంబర్‌ 1 నువ్వే అని తన మనసులో ఉన్న మాటని చెప్పేశాడు. అంతేకాదు తన గురించి కూడా కొన్ని విషయాలు చెప్పాడు మెహబూబ్‌. తాను గేమ్, టాస్క్ ల కోసం చాలా కష్టపడ్డానని, హార్డ్ వర్క్ చేయడం నేర్చుకున్నానని తెలిపాడు. బిగ్‌బాస్‌ హౌజ్‌ చాలా నేర్పించిందన్నాడు. అంతేకాదు గతంలో ఏదైనా ఓ పని చేయాలంటే ఇతరుల సలహాలు తీసుకునే వాడినని, హౌజ్‌లోకి వచ్చాక సొంతంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నానని చెప్పాడు. 

ఇక వెళ్తూ వెళ్తూ అవినాష్ కోరిక మేరకు అతడిపై బిగ్ బాంబ్ వేశాడు. ఈ మేరకు అవినాష్ వచ్చే వారమంతా మటన్ తినకూడదు. రేషన్ మేనేజర్‌‌గా ఉన్న అవినాష్.. మటన్ డీఫ్రిజ్‌లో పెట్టకుండా నార్మల్ ఫ్రీజ్‌లో పెట్టడం వల్ల మటన్ పాడయ్యింది. అందుకు శిక్షగా వచ్చే వారం అవినాష్ మటన్ తినకుండా బాంబ్ వేశాడు మెహబూబ్. ఐతే రెండు వారాల పాటు ఉండాల్సిన శిక్షను వారానికి కుదించారు హోస్ట్ నాగార్జున. దీంతోపాటు సభ్యుల కోరిక మేరకు తీసుకొచ్చిన రెండు కిలోల మటన్‌ని కూడా బ్యక్‌ పంపించమని చెప్పారు సభ్యులు.