మేఘనా రాజ్ కన్నడ బిగ్‌బాస్‌ 4 విన్నర్‌ ప్రథమ్‌ ను వివాహం చేసుకోబోతున్నట్లు రూమర్స్‌ సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి. వీటిపై ప్రథమ్‌ ట్విట్టర్‌లో తీవ్రంగా స్పందించారు.   

గతేడాది నటి మేఘనా రాజ్ భర్త కన్నడ స్టార్‌ హీరో చిరంజీవీ సర్జా గుండెపోటుతో ఆకస్మాత్తుగా మరణించాడు. హీరో అర్జున్ కి చిరంజీవి సర్జా స్వయానా మేనల్లుడు కాగా, ఆ సమయంలో మేఘనా రాజ్ నాలుగు నెలల గర్భవతి. భర్త మరణం అనంతరం ఆమె ఓ కుమారుడికి జన్మనిచ్చింది. కాగా మేఘనా రాజ్ కన్నడ బిగ్‌బాస్‌ 4 విన్నర్‌ ప్రథమ్‌ ను వివాహం చేసుకోబోతున్నట్లు రూమర్స్‌ సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి. వీటిపై ప్రథమ్‌ ట్విట్టర్‌లో తీవ్రంగా స్పందించారు.

ప్రథమ్ యూట్యూబ్‌లోని సదరు వీడియోని షేర్‌ చేశాడు. ‘వ్యూస్‌, డబ్బు కోసం ఇతరులకు ఇబ్బంది కలిగించేలా రూమర్స్‌ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికి వరకు ఈ వీడియోను పట్టించుకోలేదు. కానీ ఒక్కరోజులో దాదాపు 2.7 లక్షలపైగా దీన్ని చూశారు. వీటిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటేనే ఇంకొకరు ఇలాంటివి పెట్టకుండా ఉంటారు’ మండిపడ్డారు. 

నటి మేఘన రాజ్‌ కన్నడ, మలయాళ చిత్రసీమలోని అగ్ర కథానాయికలలో ఒకరు. ‘కాదల్ సొల్లా వందేన్’, 'నంద నందిత' వంటి చిత్రాలతో తమిళ ప్రేక్షకులకు సైతం సుపరిచితురాలే. అయితే చిరు మరణించిన దాదాపు ఏడాది తర్వాత మేఘన. ఇప్పటివరకు ఈ రూమర్స్‌పై మేఘనా రాజ్ స్పందించలేదు. దాదాపు పది సంవత్సరాలు డేటింగ్ చేసిన చిరు, మేఘనా రాజ్, 2018లో వివాహం చేసుకున్నారు. 

Scroll to load tweet…