టాలీవుడ్ కి మరో వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సీనియర్ యాక్టర్ శ్రీహరి ప్పెద్ద కుమారుడు మేఘాంశ్ త్వరలో రాజ్ దూత్ అనే సినిమా ద్వారా హీరోగా పరిచయం కాబోతున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ అయిపోకముందే మరో సినిమాను లైన్ లో పెట్టాడు. 

ఇక అదే తరహాలో జీవిత రాజశేఖర్ కుమార్తె కూడా ఈ సినిమాలో అవకాశం అందుకుంది. శివాత్మిక దొరసాని సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఇప్పుడు అమ్మడు మేఘంష్ తో నటించడానికి సిద్ధమవుతోంది. 

మేఘాంశ్ - శివాత్మిక నటించబోయే సినిమా రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా సాగుతుందట. కొత్త దర్శకుడు ఈ ప్రాజెక్ట్ ను తెరకెక్కించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సత్యనారాయణ నిర్మించబోయే ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ త్వరలోనే వెలువడనుంది.