లై సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన క్యూట్ పిల్ల మేఘా ఆకాష్ మొదటి చూపులోనే కుర్రాళ్లను తెగ ఎట్రాక్ట్ చేసింది. అపజయాలు ఎన్ని వస్తున్నా కూడా అందంతోనే అవకాశాలు అందుకుంటూ కెరీర్ ను ఒక ట్రాక్ లో నడిపిస్తోంది. ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కి సౌత్ లో స్టార్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇవ్వాలని ఆశపడుతోంది. 

ఛల్ మోహన్ రంగ - పేట - వందా రాజాదా వ‌రువేన్ (అత్తారింటికి దారేది రీమేక్) వంటి సినిమాల్లో నటించి అపజయాలను మూటగట్టుకుంది. అయినా కూడా బేబీ లక్కు స్ట్రాంగ్ గా ఉండడంతో ఆఫర్స్ కాళ్లదగ్గరకు వచ్చేస్తున్నాయి. రీసెంట్ గా విజయ్ సేతుపతి సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది. 

అసలైతే విజయ్ తో అమలాపాల్ నటించాల్సి ఉండగా ఆమె తప్పుకోవడంతో ఆ ఛాన్స్ మేఘా ఆకాష్ ని వరించింది. ఈ సినిమాపై బేబీ అంచనాలు భారీగా పెంచేసుకుందట. ఎందుకంటే సినిమా రిజల్ట్ తేడా కొట్టినా నటిస్తున్న పాత్ర హైలెట్ అవుతుందట. అందుకే బేబీ అవకాశాలకు డోకా లేదని కాన్ఫిడెన్స్ తో ముందుకు సాగుతోంది.