Asianet News TeluguAsianet News Telugu

‘వాల్తేరు వీరయ్య’..నాన్ రాజమౌళి రికార్డ్ కాదా?, చిరు చెప్పించి నిజం కాదా... ఈ రచ్చ ఏమిటి

 తెలుగు రాష్ట్రాల్లోను వాల్తేరు వీరయ్య సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్‌ను రాబడుతోంది. మొదటి నాలుగు రోజులు ఈ సినిమా  బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోసింది.  

Megastar #WaltairVeerayya as Non Rajamouli record is Fake?
Author
First Published Jan 30, 2023, 11:39 AM IST


మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. బాబీ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించారు. ఈ నెల 13న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.ఈ సినిమా సక్సెస్‌తో చిరంజీవి ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరినట్లు అయ్యింది.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం కలెక్షన్స్ గురించి అంతటా హాట్ టాపిక్ గా మారాయి. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 865 థియేటర్స్‌లో విడుదలైంది. ఫస్ట్ డే మిగితా ఏరియాలతో పోల్చితే నైజాంలో ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను అందుకుంది. ఒక్క నైజాం ఏరియానే కాదు.. అటు సీడెడ్, ఉత్తరాంధ్రలోను మంచి బుకింగ్స్ నమోదు అయ్యాయి..  అంతేకాదు ఈ చిత్రం ఇప్పటికే అమెరికాలో రికార్డ్ లు క్రియేట్ చేసింది. ఇక ఇటు తెలుగు రాష్ట్రాల్లోను వాల్తేరు వీరయ్య సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్‌ను రాబడుతోంది. మొదటి నాలుగు రోజులు ఈ సినిమా  బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోసింది. అయితే ఈ సినిమా కలెక్షన్స్ గురించి చిరంజీవి మాటలు ఇప్పుడు కొంతమంది ఫేక్ అంటూ సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.

రీసెంట్ గా వాల్తేరు వీరయ్య భారీ విజయం సాధించినందుకు వరంగల్ లో వీరయ్య విజయ విహారం పేరిట భారీ సభని నిర్వహించారు. ఈ ఈవెంట్ కి చిత్రయూనిట్ తో పాటు రామ్ చరణ్ కూడా విచ్చేశాడు. ఈ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ మరోసారి సినిమా గురించి, సినిమాకి వర్క్ చేసిన వాళ్ళ గురించి, సినిమా సక్సెస్ గురించి మాట్లాడారు. చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా సక్సెస్ గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా తీస్తున్నప్పుడే హిట్ అవుతుంది అనుకున్నాము. కానీ ఈ రేంజ్ లో ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదు. ఈ సినిమా నాన్ బాహుబలి, నాన్ RRR స్థాయిలో హిట్ అయి కలెక్షన్స్ ని తీసుకొస్తుంది. వాల్తేరు వీరయ్య సినిమా నాన్ రాజమౌళి రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇంతటి సక్సెస్ ఇచ్చినందుకు ఈ సక్సెస్ అగ్ర తాంబూలం ప్రేక్షకులకే. నాకు మళ్ళీ ఇంతటి భారీ సక్సెస్ ఇచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు అని తెలిపారు.

అయితే  నాన్ బాహుబలి, నాన్ RRR కలెక్షన్స్ లేవంటూ ....ఓ వర్గం చెప్తున్న లెక్కలు ఇవి...

USA : ఫుల్ రన్ ...17 వ స్దానం

తెలంగాణా:  10-12 కోట్లు తక్కువగా ... హైయిస్ట్ గ్రాస్ ఫిల్మ్ లలో 5 వ ది 

సీడెడ్ : 7 వ స్దానం 

 

ఇక ట్రేడ్ నుంచి అందుతున్న లెక్కలు ప్రకారం ‘వాల్తేరు వీరయ్య’కు థియేట్రిక‌ల్‌ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.88 కోట్లు జ‌రిగింది. రూ.89 కోట్లు వ‌స్తేనే సినిమా హిట్ అవుతుంది. అయితే ఈ సినిమా రావాల్సిన దాని కంటే ఎక్కువ‌గానే రాబ‌ట్టింది.  బాక్సాఫీస్ లెక్క‌ల ప్ర‌కారం.. ‘వాల్తేరు వీరయ్య’ రెండు వారాల‌కు క‌లిపి రూ.125 కోట్లు షేర్ క‌లెక్ష‌న్స్‌ను సాధించింది. ఆ మేర‌కు లెక్కిస్తే ఈ సినిమాకు ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపుగా రూ.35 కోట్ల రూపాయ‌లు లాభాలు వ‌చ్చాయి. ఇది కాకుండా శాటిలైట్‌, యూ ట్యూబ్‌, డిజిట‌ల్ హ‌క్కులుంటాయి. ఇవ‌న్నీ క‌లుపుకుంటే మేక‌ర్స్‌కు ప్రాఫిట్స్ బాగానే వ‌చ్చినట్లే. ఈ మధ్యం కాలంలో మెగా హిట్ ఫిల్మ్ ఇది. చిరంజీవి వంటి ఓ సీనియర్ హీరో అంత పెద్ద హిట్ కొడతారని అసలు ఊహించము. యంగ్ హీరోలు కూడా విస్తుపోయే స్దాయిలో కలెక్షన్స్ వర్షం కురిసిందననేది నిజం. ఫైనల్ గా సినిమా లెక్కలు అనేవి ఖచ్చితంగా ఎవరు చెప్పలేరని సీనియర్ నిర్మాతలు అంటూంటూరు.కొంత అంచనా, కొంత ఖచ్చితత్వం ఉంటుందని చెప్తూంటారు. 

Follow Us:
Download App:
  • android
  • ios