బాలీవుడ్ సినిమాలు టాలీవుడ్ లో పెద్దగా రిలీజ్ కావని అందరికి తెలిసిన విషయమే. కానీ ఇటీవల కాలంలో సౌత్ లో ఫ్యాన్ ఇండియా పేరుతో తమిళ్ కన్నడ టాలీవుడ్ ల నుంచి బడా సినిమాలు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని టార్గెట్ చేస్తున్నాయి. ప్రతిసారి బాలీవుడ్ నుంచి ఒక స్టార్ సౌత్ సినిమాల ప్రమోషన్స్ కు సాయం అందిస్తున్నారు. 

ఇక ఇప్పుడు మెగాస్టార్ సైరా సినిమా కూడా సల్మాన్ ను వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. రెగ్యులర్ ప్రమోషన్స్ తో సల్మాన్ మెగాస్టార్ సినిమాకు నార్త్ లో హైప్ పెంచాలని డిసైడ్ అయ్యాడట. అదే విధంగా ముందే సినిమాను వీక్షించనున్నట్లు తెలుస్తోంది. సల్మాన్ కు అలాగే మరికొంత మంది బాలీవుడ్ స్టార్స్ కి నిర్మాత రామ్ చరణ్ స్పెషల్ షోను ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది. 

అమీర్ ఖాన్ కూడా సైరా సినిమాను చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. ఇప్పటికే హిందీ ట్రైలర్ పై ఓ లుక్కేసిన ఇద్దరు స్టార్ హీరోలు సైరా సినిమా కోసం ఎదురుచూస్తున్నట్లు ఎనౌన్స్ చేశారు. అందుకే మెగాస్టార్ కోరిక మేరకు రామ్ చరణ్ స్పెషల్ షోలను ముంబై లో ప్రదర్శించిననున్నట్లు టాక్. ప్రస్తుతం సినిమాకు సంబందించిన బిజినెస్ డీలింగ్స్ లో రామ్ చరణ్ బిజీగా ఉన్నాడు. ఇక అక్టోబర్ 2న సినిమా వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.