Asianet News TeluguAsianet News Telugu

ప్రముఖ ఓటీటీ సంస్థకు మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ డిజిటల్ రైట్స్.!

మెగాస్టార్ తాజాగా నటించిన పొలిటికల్ యాక్షన్ ఫిల్మ్ ‘గాడ్ ఫాదర్’ (Godfather). ఈ మూవీ వచ్చే నెలలో థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. కాగా ప్రముఖ ఓటీటీ సంస్థ డిజిటల్ రైట్స్ ను దక్కించుకుందని సమాచారం. 
 

Megastar God father Movie digital rights to popular OTT company!
Author
First Published Sep 18, 2022, 3:35 PM IST

మలయాళంలో రూపుదిద్దుకున్న పొలిటికల్ ఫిల్మ్ ‘లూసిఫర్’ 2019 లో బ్రహ్మాండమైన విజయం సాధించింది. అదే చిత్రాన్ని తెలుగులో ‘గాడ్ ఫాదర్’గా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 
మూవీకి మోహన్ రాజా దర్శకత్వ వహించారు.  20 ఏండ్ల తర్వాత మోహన్ రాజా.. చిరంజీవిని డైరెక్ట్ చేస్తూ టాలీవుడ్ కు రీఎంట్రీ ఇస్తున్నారు. ‘హనుమాన్ జంక్షన్’తో తెలుగు ఆడియెన్స్ ను మెప్పించారు దర్శకుడు మోహన్ రాజా. ప్రస్తుతం Godfather చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 

ఇప్పటికే చిత్రం నుంచి వచ్చిన అప్డేట్స్ సినిమాపై  ఆసక్తిని పెంచుతున్నారు. మెగాస్టార్ పెర్ఫామెన్స్, న్యూ లుక్ చాలా కొత్తదనంగా ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో సినిమాల్లో థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఓటీటీ రైట్స్ ను కూడా మేకర్స్ విక్రయించినట్టు తెలుస్తోంది. ప్రముఖ ఓటటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ (Netfilx) భారీ ధరకు చిత్ర డిజిటల్ రైట్స్ ను దక్కించుకున్నట్టు సమాచారం. మరోవైపు రిలీజ్ కు దగ్గరవుతున్న సందర్భంగా చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ మేరకు క్రేజీ అప్డేట్స్ ను విడుదల చేస్తూ మెగా ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు. 

నిన్న వచ్చిన మాస్ సాంగ్ ‘తార్ మార్ తక్కర్ మార్’కు ఆడియెన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ బాయ్ జాయ్ సల్మాన్ ఖాన్ (Salman Khan) కలిసి చిందులేయడంతో ఫ్యాన్స్ లో జోష్ నింపింది. ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు మెగాస్టార్లను చూడటం పట్ల అభిమానులు, ఆడియెన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్లపై రామ్ చరణ్, ఆర్బీ చౌదరి, ఎన్బీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. హీరోయిన్ గా నయనతారా ఆడిపాడింది. పూరీ జగన్నాథ్, సత్యదదేవ్, మురళీ శర్మ, సునీల్, బ్రహ్మాజీ, సముద్రఖని, గంగవ్వ ఆయా పాత్రలను పోషించారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ సంగీతం అందించారు. అక్టోబర్ 5న మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios