సెలబ్రిటీల బట్టలు, వేసుకునే చెప్పులూ.. పెట్టుకునే వాచ్.. తిరిగే కార్లు.. ఉండే ఇళ్లు.. వీటిపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు నెటిజన్లు. వాటిలో డిఫరెంట్ గా ఏదైనా వాడుతున్నారు అంటే చాలు.. ఆ వస్తువులను.. వాటి కాస్ట్ ను వైరల్ చేస్తుంటారు అభిమానులు. తాజాగా మెగాస్టార్ పెట్టుకున్న వాచ్ కాస్ట్ వైరల్ అవుతోంది.  

సెలబ్రిటీల బట్టలు, వేసుకునే చెప్పులూ.. పెట్టుకునే వాచ్.. తిరిగే కార్లు.. ఉండే ఇళ్లు.. వీటిపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు నెటిజన్లు. వాటిలో డిఫరెంట్ గా ఏదైనా వాడుతున్నారు అంటే చాలు.. ఆ వస్తువులను.. వాటి కాస్ట్ ను వైరల్ చేస్తుంటారు అభిమానులు. తాజాగా మెగాస్టార్ పెట్టుకున్న వాచ్ కాస్ట్ వైరల్ అవుతోంది. 

రీసెంట్ గా రిలీజ్ అయ్యి.. సూపర్ సక్సెస్ అయిన చిన్న సినిమా బేబీ.. ఈ మూవీ స‌క్సెస్ మీట్ లో పాల్గొన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈమూవీ గురించి.. ఇతర విషయాలపై ఆయన స్పీచ్ అదిరిపోయింది. అయితే అందరి ఆలోచన ఆయన మాట్లాడే దానిపై ఉంటే.. కొందరు మాత్రం ఆయన వేసుకున్న డ్రస్.. పెట్టుకున్న వాచ్.. మెగాస్టార్ స్టయిల్ పై దృష్టి పెట్టారు. బ్రౌన్ టీ ష‌ర్ట్‌, క్రీమ్ ప్యాంట్ వేసుకున్న చిరంజీవి.. స్టైలిష్ లుక్ లో.. కుర్ర హీరోలు కూడా కుళ్ళుకునేలా కనిపించారు. అంతే కాదు ఆయన చేతికి పెట్టుకున్న కాస్ట్లీ వాచ్ కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

మెగాస్టార్ త‌న చేతికి రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా ఐ ఆఫ్ ది టైగర్ వాచ్ ను పెట్టుకున్నాడు. ఈ వాచ్ అటు అభిమానులను.. ఇటు నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. అంతే కాదు ఈ వాచ్ ధర ఎంతా అని ఫ్యాన్స్ నెట్టింట్లో ఆరాతీస్తున్నారు. దాని ధర తెలిసి షాక్ అవుతున్నారు. మెగాస్టార్ వాచ్ గురించి న్యూస్ ను వైరల్ చేస్తున్నారు.ఈ వాచ్ మార్కెట్ విలువ 230,000 డాలర్లు. మ‌న ఇండియ‌న్ క‌రెన్సీలో చెప్పాలంటే.. అక్ష‌రాల‌ 1.89 కోట్లు. అంటే దాదాపుగా 2 కోట్లు విలువ చేసే వాచ్ ను చిరంజీవి పెట్టుకున్నారు.

 ఈ విష‌యం తెలిసిందే నెటిజ‌న్లు నోరెళ్ల‌బెతున్నాడు. ఒక వాచ్ కోసం మెగాస్టార్ చిరంజీవి అంత ఖ‌ర్చు పెట్టారా అంటూ నెటిజన్లు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. మెగాస్టార్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈనెల 11న `భోళా శంక‌ర్` మూవీతో థియేర్లలో సందడి చేయబోతున్నాడు. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో త‌మ‌న్నా హీరోయిన్ గా న‌టించింది. కీర్తి సురేష్‌ మెగాస్టార్ చెల్లలిగా నటించగా.. సుశాంత్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోసించారు.