ఇన్సైడ్ టాక్ ప్రకారం ఓ విషయంలో చిరంజీవి టాప్ ప్రొడ్యూసర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అల్లు అరవింద్, సురేష్ బాబు, సునీల్ నారంగ్, దిల్ రాజు లే ఆ టాప్ ప్రొడ్యూసర్లు.

కరోనా పరిస్థితులు టాలీవుడ్ లో అనేక మార్పులు తీసుకువస్తున్నాయి. థియేటర్ల బిజినెస్ మునుపటిలా ఎగ్జిబిటర్లకు లాభదాయకంగా కనిపించడం లేదు. దీనికి కరోనా పరిస్థితులు ఓ కారణం అయితే.. ఏపీలో ప్రభుత్వం విధించిన టికెట్ ధరలు మరో కారణం. సెకండ్ వేవ్ ప్రభావం తగ్గాక కూడా ఏపీలో థియేటర్లు తెరుచుకోలేదు. 

దీనితో టాలీవుడ్ సమస్యలపై చర్చించేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నుంచి మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందింది. దీనితో చిరంజీవి టాలీవుడ్ ప్రముఖులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, సునీల్ నారంగ్ లాంటి టాప్ ప్రొడ్యూసర్లు పాల్గొన్నారు. 

వీరితో పాటు నాగార్జున, కొరటాల శివ, వివి వినాయక్ లాంటి ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఇన్సైడ్ టాక్ ప్రకారం ఓ విషయంలో చిరంజీవి టాప్ ప్రొడ్యూసర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

అల్లు అరవింద్, సురేష్ బాబు, సునీల్ నారంగ్, దిల్ రాజు లే ఆ టాప్ ప్రొడ్యూసర్లు. గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో వర్చువల్ ప్రింట్ ఫీ ప్రధాన సమస్యగా మారింది. దీనిపై చిరంజీవి చర్చిస్తూ ప్రొడ్యూసర్స్ కి వార్నింగ్ ఇచ్చారు. చివరకు తన బావమరిది అల్లు అరవింద్ ని కూడా వదిలిపెట్టలేదు. 

డిస్ట్రిబ్యూటర్ల నుంచి వర్చువల్ ప్రింట్ ఫీ వాసులు చేయడం ఇక ఆపాలని చిరంజీవి తెలిపారు. దీనికి అల్లు అరవింద్, దిల్ రాజు వెంటనే అంగీకారం తెలిపారు. కానీ సురేష్ బాబు, సునీల్ నారంగ్ లు తమ నిర్ణయాన్ని వారంలో ప్రకటిస్తామని అన్నారట. 

డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు డిస్ట్రిబ్యూటర్స్ నుంచి వర్చువల్ ప్రింట్ ఫీ రూపంలో రూ 30వేల వరకు రెంట్ వసూలు చేస్తున్నారట. ఇక నుంచి ఈ విషయంలో డిస్ట్రిబ్యూటర్స్ ని ఇబ్బంది పెట్టవద్దని.. థియేటర్ ఓనర్స్ నుంచే ఆ మొత్తాన్ని తీసుకోవాలని చిరంజీవి కోరారు. అలాగే ఆన్లైన్ టికెట్స్ గురించి కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. త్వరలో చిరంజీవి సినీ ప్రముఖులతో కలసి జగన్ ని మీట్ కానున్నారు.