Asianet News TeluguAsianet News Telugu

వాల్తేరు వీరయ్య అరుదైన రికార్డు, మెగాస్టార్ అభిమానులకు పండగే...

మెగాస్టార్ వరుస సినిమాలలో కాస్త హిట్ అయ్యి ఊరటనిచ్చిన మూవీ వాల్తేరు వీరయ్య. ఈసినిమా సక్సెస్ తో హ్యాపీపీల్ అయ్యారు చిరంజీవి. ఇక తాజగా ఈమూవీ మెగాస్టార్ కు మరో ఆనందాన్ని ఇచ్చింది. అంతే కాదు ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేస్తోంది.
 

Megastar Chiranjeevi Waltair Veerayya Movie Running 365 days In Ramakrishna Theater avanigadda JMA
Author
First Published Jan 9, 2024, 3:08 PM IST

వరుస సినిమాలు ప్లాప్ అవ్వడంతో మెగాస్టార్ చిరంజీవి కాస్త ఆలోచనలో పడ్డారు. అందుకే ఈసారి కాస్త జాగ్రత్తగా ఆలోచించి.. బింబిసార దర్శకుడు వశిష్టకు అవకాశం ఇచ్చారు. ఇక లాస్ట్ 2 ఇయర్స్ లో చిరంజీవి నటించిన ఆచార్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్ లాంటి సినిమాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. అయితే వాల్తేర్ వీరయ్య సినిమా మాత్రం మెగాస్టార్ కు ఆనందాన్ని అందించింది. ఈమూవీ హిట్ తో ఎన్ని ప్లాప్ లు వచ్చినా.. ఆయన కాస్త ఊరటనిచ్చింది వాల్తేరు వీరయ్య. 

ఇక ఈమూవీ రిలీజ్ అయ్యి ఏడాది కావస్తున్నా.. ఇంకా మరో మెమెరబుల్ మూమెంట్ ను అందించింది. మెగాస్టార్ కు అనుకోని ఆనందాన్ని ఇచ్చింది. ఒకప్పుడు సినిమాలు 100 రోజులు ఆడితే హిట్ అయ్యేవి.. కాని ఇప్పుడు 100 కోట్లు..వెయ్యి కోట్ల కలెక్షన్లు దాటితే కాని హిట్ అనిపించుకోవడం లేదు. అంతే కాదు. ఈ కలెక్షన్లు కూడా వారం పదిరోజుల్లో సాధిస్తేనే సినిమా హిట్ అంటున్నారు. ప్రస్తుతం పరిస్థితులు అలా మారిపోయాయి. ఈక్రమంలో వందరోజులు సినిమాలు కరువైపోయాయి. మెగాస్టార్ హిట్ సినిమాలన్నీ వందరోజులు పైన ఆడినవే ఉండేవి. 


కాని ఈ రోజుల్లో పట్టుమని పది రోజులు ఆడిన సినిమాలులేవు. ఎంత పెద్ద సినిమా అయినా.. ఎన్ని కోట్లు పెట్టినా..  నెల రోజులలోపే దుకాణాలు కట్టేసుకుంటున్నాయి. అలాంటిది సంవత్సరం పాటు సినిమా ఆడటమంటే మాటలు కాదు. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా ఈ ఘనతను సాధించింది. లాస్ట్ ఇయర్ అంటే 2023 సక్రాంతి  కానుకగా.. జనవరి 13 నరిలీజ్ అయిన ఈసినిమా సూపర్ హిట్ అవ్వడమే కాదు.. ఏడాది పాటు ఓ థియేటర్ లో నడిచి రికార్డ్ క్రియేట్ చేసింది. 

ఆంధ్రప్రదేశ్‌లోని అవనిగడ్డలో ఉన్న రామకృష్ణ థియేటర్‌లో రోజుకు నాలుగు ఆటలతో విడుదలైన రోజు నుంచి ఇప్పటి వరకు వాల్తేరు వీరయ్య సినిమా  నడుస్తూనే ఉంది. మరో రెండు రోజుల్లో 365 రోజులు పూర్తి చేసుకుని  సరికొత్త రికార్డ్‌ను క్రియేట్‌ చేయనుంది. మెగాస్టార్ చిరంజీవి తో పాటు రవితేజ కూడా  నటించి మల్టీ స్టారర్ మూవీగా తెరకెక్కింది వాల్తేరు వీరయ్య.. ఇక ఈమూవీలో మెగాస్టార్ సరసన హీరోయిన్ గా  శ్రుతిహాసన్‌  నటించింది. ఇక ఈసినిమా దాదాపు 250 కోట్లు వసూళ్లు చేసి.. బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. 


గత ఏడాది  అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా ఇప్పటికే వాల్తేరు వీరయ్య సినిమా ఒక రికార్డు నెలకొల్పింది. ఇక ఇప్పుడు మరోరికార్డ్ తో మెగా ఫ్యాన్స్ కు దిల్ ఖుష్ అయ్యింది. ఇక ఈరోజు అనగా జనవరి 9న అవనిగడ్డ రామకృష్ణ థియేటర్‌లో చిరంజీవి అభిమానులు 365 రోజలు వేడుక చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios