మెగాస్టార్ చిరంజీవి Chiranjeevi 2025 సంక్రాంతి బరిలో దిగారు. సోషియో ఫాంటసీగా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘విశ్వంభర’ Vishwambhara అఫిషీయల్ రిలీజ్ డేట్ వచ్చేసింది.
మెగాస్టార్ చిరంజీవి నెక్ట్స్ క్రేజీ ప్రాజెక్ట్ తో రాబోతున్నారు. ‘బింబిసారా’ డైరెక్టర్ వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇప్పటికే ఆ చిత్రానికి ‘విశ్వంభర’ Vishwambhara అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసి అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. టైటిల్ పోస్టర్ విడుదలైన తర్వాత ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ మాత్రం శరవేగంగా కొనసాగుతోంది. భారీ విజువల్స్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే... ఈ చిత్రం రిలీజ్ డేట్ పై మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. సంక్రాంతి బరిలో చిరు దిగుతున్నారంటూ టాక్ వినిపించింది. అనుకున్నట్టుగా మెగాస్టార్ 2025 సంక్రాంతి పోటీని ప్రారంభించారు. తాజాగా ‘విశ్వంభర’ మూవీ మేకర్స్ రిలీజ్ డేట్ ను అషీఫియల్ గా అనౌన్స్ చేశారు. విజువల్ వండర్స్ అనిపించేలా పోస్టర్ తో విడుదల తేదీని ప్రకటించారు. 2025 జనవరి 10న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్నట్టు అధికారికంగా తెలియజేశారు.
ఇక ఈ చిత్ర విడుదల తేదీ అనౌన్స్ మెంట్ తోపాటు వదిలిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఒక లోకం నుంచి మరో లోకంలోకి వెళ్తున్న చిరంజీవిని చూపించారు. చూట్టు పర్వతాలు, కారుమబ్బులు, ప్రకాశవంతమైన కాంతి చూపిస్తున్న పోస్టర్ ఆకట్టుకుంటోంది. మెగాస్టార్ ఫస్ట్ లుక్ పై ఆసక్తిని పెంచుతోంది.
ఇక ‘విశ్వంభర’ సోషియో ఫాంటసీ సబ్జెక్టు తో తెరకెక్కుతున్న చిత్రం. చిరంజీవి మూడు లోకాల్లో సంచరిస్తారని, ముగ్గురు హీరోయిన్స్ కి పైగా నటించే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి (MM Keeravani) సంగీతం అందిస్తున్నారు.

