సారాంశం
మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర చిత్రం తో ఫ్యాన్స్ కి నిరీక్షణ తప్పడం లేదు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన విశ్వంభర చిత్రం పలు కారణాల వల్ల వాయిదా పడుతూనే ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ ఇతర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు బాగా ఆలస్యం అవుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర చిత్రం తో ఫ్యాన్స్ కి నిరీక్షణ తప్పడం లేదు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన విశ్వంభర చిత్రం పలు కారణాల వల్ల వాయిదా పడుతూనే ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ ఇతర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు బాగా ఆలస్యం అవుతున్నాయి. బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి నటిస్తున్న ఫాంటసీ చిత్రం ఇదే. గతంలో చిరంజీవి ఇదే తరహాలో జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి చిత్రాల్లో నటించారు.
తాజాగా విశ్వంభర రిలీజ్ డేట్ గురించి ఆసక్తికర న్యూస్ వైరల్ గా మారింది. ఇది మెగా ఫ్యాన్స్ కి ఇబ్బంది కలిగించే న్యూస్ అని చెప్పొచ్చు. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం మే నెలకు వాయిదా పడింది. కానీ మేలో కూడా ఈ మూవీ రిలీజ్ కావడం లేదు. ఆ తర్వాత జూలైలో రిలీజ్ అవుతుంది అంటూ ప్రచారం జరిగింది. దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. లేటెస్ట్ గా వినిపిస్తున్న అప్డేట్ ఏంటంటే విశ్వంభర చిత్రం సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతుందని తెలుస్తోంది.
దీంతో మెగా ఫాన్స్ షాక్ అవుతున్నారు. అసలు విశ్వంభర చిత్రం వెనుక ఏం జరుగుతుంది.. అంతా ఓకేనా?.. మరి ఈ స్థాయిలో ఆలస్యానికి కారణం ఏంటి అంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. సెప్టెంబర్ 25న రిలీజ్ పై కూడా చిత్ర యూనిట్ నుంచి అధికారిక సమాచారం లేదు.
ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. కునాల్ కపూర్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఇటీవల విడుదల చేసిన రామ రామ అనే సాంగ్ బాగానే ఉంది కానీ ఆడియన్స్ నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. టీజర్ రిలీజ్ అయినప్పుడు కూడా విజువల్ ఎఫెక్ట్స్ పై విమర్శలు వచ్చాయి.