Asianet News TeluguAsianet News Telugu

మెగా ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్, చిరంజీవి ఆసినిమాను పక్కన పెట్టారట నిజమేనా...?

సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి జోరు చూపిస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం నాలుగు సినిమాలు ట్రాక్ ఎక్కించిన చిరంజీవి.. మరో వెంకీ కుడుములతో మరో సినిమాను అనౌన్స్ చేశాడు. కాని ఈసినిమాపై సస్పెన్స్ ఏర్పడింది. ఇంతకీ ఈసినిమా ఉంటుందా లేదా..?

Megastar Chiranjeevi Venky Kudumula Movie Update
Author
First Published Sep 16, 2022, 12:09 PM IST

మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోష్‌లో సినిమాల‌ను చేస్తున్నాడు. ప్లాప్ అవ్వని.. హిట్ అవ్వనీ... ఏదైనా కాని.. ఒకదాని వెంట ఒకటి  సినిమాల‌ను మాత్రం సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. రీసెంట్ గా  ఆచార్య‌  సినిమాతో మెగాస్టార్ తీవ్ర నిరాశచెందారు.. అంతే కాదు ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశ‌ప‌రిచారు  మెగాస్టార్. ఇక ఈ దసరాకు గాడ్ ఫాదర్ సినిమాతో ఫ్యాన్స్ కు భారీ ట్రీట్ ను ప్లాన్ చేస్తున్నాడు.  నెక్ట్స్ సినిమాలతో.. ఫ్యాన్స్ ను ఎగిరెసుకునేలా హిట్టు ఇవ్వాల‌ని క‌సితో ఉన్నాడు. అందుకు తగ్గట్టుగానే సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు మెగాస్టార్.  ప్ర‌స్తుత చిరు చేతిలో య నాలుగు సినిమాలున్నాయి. అందులో యంగ్ డైరెక్టర్  వెంకీ కుడుములతో కూడా ఓ మూవీ ఉంది. కాని ఆ సినిమాపై ప్రస్తుతం సందిగ్థం నెలకొంది.

ఛలో, బీష్మ సినిమాలతో సూపర్ హిట్లు కొట్టడంతో మెగాస్టార్ వెంకీకి పిలిచిమరీ అవకాశం ఇచ్చాడు.  మెగాస్టార్ తో ఓ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ చేస్తున్నట్లు గ‌తంలోనే ప్ర‌క‌ట‌న చేశారు చిరంజీవి. అంతే కాదు.. ఆర్ఆర్ఆర్ నిర్మాత డీ.వి.వి దాన‌య్య ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు అనౌన్స్ చేశారు.  అయితే తాజాగా అందుతున్న స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా కాన్సిల్ అయింద‌ని తెలుస్తుంది. సినిమాఅయితే అనౌన్స్ చేశారు కాని.. ఇప్పటి వరకూ ఈ సినిమాపై ఎటువంటి అప్ డేట్ ఇవ్వలేదు. కనీస కదలిక లేదు. దాంతో సినిమాపై ఎప్పటినుంచో డౌట్ మొదలయ్యింది మెగా ఫ్యాన్స్ లో. 

అంతే కాదు ఆచార్య అట్టర్ ప్లాప్ అవ్వడందో వెంకీ కుడుముల సినిమాపై నీలి నీడలు కమ్ముకున్నట్టు తెలుస్తోంది. అనవసరంగా ఈసినిమాను అనౌన్స్ చేశానేమో అని చిరు అనుకుంటున్నట్టు రూమర్ నడుస్తోంది. టాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం చిరు, వెంకీ కుడుము ప్రాజెక్ట్ అయిన‌ట్లు టాక్‌. మెగాస్టార్  ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌పై అంత‌గా ఆస‌క్తి చూప‌డం లేద‌ట‌. మెగాస్టార్‌ ముందుగా సెకండ్ హాఫ్‌ను మార్చ‌మ‌ని డైరెక్ట‌ర్‌కు చెప్పాడ‌ట‌. వెంకీ కుడుముల కూడా దాన్ని మార్చాడ‌ట‌. అయితే మార్చిన సెకండ్ హాఫ్ కూడా చిరుకి అంత‌గా న‌చ్చ‌లేద‌ని టాక్‌. ఆచార్య ఫేయిల్యూర్‌తో చిరు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. అందుకే సినిమాల విషయంలో రకరకాలుగా  ఆలోచిస్తున్నాడ‌ట‌. 

అయితే  ఈ విషయంలో ఇండస్ట్రీలో మరికొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ ఈ  సినిమాను  అసలు క్యాన్సిల్ చేయ‌లేద‌ని.. హోల్డ్‌లో పెట్టాడ‌ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఇంకా ఎటువంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు.  ఇక‌ ఇందులో నిజ‌మెంతుందో తెలియాలంటే.. అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఆగాల్సిందే.  ఈ ప్రాజెక్ట్ కోసం వెంకీ కుడుమ‌లు దాదాపు రెండు సంవ‌త్స‌రాలుగా వేయిట్ చేస్తున్నాడు.మెగాస్టార్ తో సినిమా తేలకపోవడంతో.. ఈ గ్యాప్ లోనే వెంకీ కుడుముల ఓ యంగ్ హీరోతో  సినిమాను ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. మెగాస్టార్ కు వీరాభిమాని అయిన  వెంకీ కుడుముల‌ గ‌తంలో ఛ‌లో సినిమాత నాగశౌర్యకు, భీష్మ సినిమాతో నితిన్ కు  బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ ఇచ్చాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios