ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. టాలీవుడ్ యంగ్ హీరోల గురించి మాట్లాడుతూ.. బన్నీ తన సినిమాల్లో ఏ సినిమా రీమేక్ చేస్తే బాగుంటుందో చెప్పారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. టాలీవుడ్ యంగ్ హీరోల గురించి మాట్లాడుతూ.. బన్నీ తన సినిమాల్లో ఏ సినిమా రీమేక్ చేస్తే బాగుంటుందో చెప్పారు. 

మెగా అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆచార్య రిలీజ్ రానే వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి కలున విందు చేయబోతున్న ఆచార్య రేపు ( ఏప్రిల్29) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికీ ఈమూవీ ప్రమోషన్స్ లో మెగాస్టార్, మెగా పవర్ స్టార్ తో పాటు డైరెక్టర్ కొరటాల కూడా బిజీగా ఉన్నారు. 

 ఇక ఆచార్య మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా టీమ్ ను దర్శకుడు హరీశ్ శంకర్ ఇంటర్వ్యూ చేశాడు. ఈ ఇంటర్వ్యూలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు చిరంజీవి. తన తనయుడు రామ్ చరణ్, అల్లుడు అల్లు అర్జున్ తో పాటు టాలీవుడ్ యంగ్ స్టార్స్ గురించి మాట్లాడారు చిరంజీవి. 
రామ్ చరణ్ కాకుండా మీ దృష్టిలో మంచి డాన్సర్స్ ఎవరు? అని డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రశ్నకు చిరంజీవి స్పందిస్తూ...వాళ్లూ వీళ్లూ అని కాదండీ.. ఈ రోజున చాలా మంది చాలా బాగా డాన్స్ చేస్తున్నారు. వీళ్లల్లా నేను చేయగలనా? అనే స్థాయిలో తారక్,అల్లు అర్జున్, రామ్ లాంటి యంగ్ స్టార్స్ బాగా డాన్స్ చేస్తున్నారు. అందరూ కూడా అత్యద్భుతంగా చేస్తున్నారు అని అన్నారు మెగాస్టార్. 

ఈ జనరేషన్ హీరోల్లో చంటబ్బాయ్ సినిమాను ఎవరు చేస్తే బాగుంటుందనే ప్రశ్నకి చిరంజీవి స్పందిస్తూ ...బన్నీ అయితే బాగా చేస్తాడు అని అన్నారు. కామెడీ టచ్ ఉన్న ఇలాంటి రోల్స్ ను తను బాగా చేయగలడు అని చిరు చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ ఆ పాత్ర చేస్తే చూడాలని ఉందన్నారు మెగాస్టార్ చిరంజీవి.

ఇక ఇలాంటి ఎన్నో చిత్రమైన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. మీరు ఒక్కసారి గా చరణ్ లా మారిపోతే చిరంజీవిగారిని ఏం అడుగుతారు అని హరీష్ శంకర్ డైరెక్టర్ కొంరటాలను విచిత్రమైన ప్రశ్న అడిగారు. కొరటాలను హరీశ్ అడగ్గానే.. చిరంజీవి జోక్యం చేసుకుంటూ నా ఆస్తి పేపర్లు అడుగుతారు అంటూ నవ్వేశారు.

ఇలా ఆచార్య ప్రమోషన్స్ ను మెగా హీరోలు ఇద్దరు అద్భుతంగా చేశారు. ఇక ఈసినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. లాంగ్ గ్యాప్ తరువాత మెగాస్టార్ సినిమాకు మణిశర్మ స్వరాలు సమకూర్చారు. ఆచార్య తరువాత మరో నాలుగు సినిమాలు మెగాస్టార్ చేస్తున్నారు. ఇటు చరణ్ కూడా శంకర్ సినిమా షూటింగ్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నాడు. మరో రెండు సినిమాలు కమిట్ అయ్యి ఉన్నాడు.