Asianet News TeluguAsianet News Telugu

డైరెక్టర్ బాబీకి సర్ ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి..? కాస్ట్ తెలిస్తే కళ్ళు తిరగాల్సిందే మరి..?

మెగాస్టార్ చిరంజీవి దిల్ ఖుష్ అయ్యారు. డైరెక్టర్ బాబీకి సర్ ప్రైజ్ ఇచ్చారు. కళ్లు చెదిరేలా..కాస్ట్లీ గిఫ్ట్ కూడా ఇచ్చాడట మెగాస్టార్. 

Megastar Chiranjeevi Surprising Gift For Director Bobby
Author
First Published Jan 19, 2023, 12:04 PM IST

ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్ లో వినిపిస్తున్న వైరల్ న్యూస్ ఇది. చాలా కాలంగా మాస్ హిట్ కోసం ఎదురు చూస్తున్న మెగాస్టార్ కు మెమరబుల్ హిట్ ఇచ్చాడు డైరెక్టర్ బాబి.  మూడు రోజుల్లోనే ఈమూవీ 100 కోట్ల క్లబ్ లోకి చేరడంతో మెగా సంతోషానికి అవదులు లేకుండా పోయింది. మరి కొత్త ఏడాది తన‌కు ఇంత మంచి సినిమాను ఇచ్చినందుకు.. ద‌ర్శ‌కుడు బాబీకి చిరంజీవి ఖ‌రీదైన గిఫ్ట్‌ ఇచ్చార‌ని ఫిల్మ్  సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. వాల్తేరు వీరయ్య సూపర్‌ డూపర్‌ హిట్‌ కొట్టడంతో దిల్ ఖుష్ అయిన మెగాస్టార్.. డైరెక్టర్ బాబీకి తన ఇంట్లో స్పెషల్ విందు ఏర్పాటు చేశారట. 

 బాబీని త‌న ఇంటికి డిన్నరకు కు ఆహ్వానించిన చిరంజీవి దాదాపు రెండు కోట్ల  విలువైల కారుని డైరెక్టర్‌కు గిఫ్ట్‌గా ఇచ్చార‌ంటూ న్యూస్ వైరల్ అవుతోంది. అయితే ఈ వార్తల్లో నిజం ఎంతో ఉందో తెలియదు కాని.. సోషల్ మీడియాలో మాత్రం ఈన్యూస్ ఫుల్ గా చక్కర్లు కొదడుతుంది. ఈ న్యూస్ కు సబంధించి ఫోటోలు కాని.. వీడియో కాని బయటకు రాలేదు. దీనిపై అటు మోగాస్టరా్  చిరంజీవి కానీ డైరెక్టర్‌ బాబీ కాని స్పందించలేదు.

ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. శ్రుతి హాసన్ హీరోయిన్ గా.. బాబీ డైరెక్షన్ లో .. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్ నిర్మాతలుగా..  వాల్తేరు వీరయ్య సినిమా తెరకెక్కింది. చిరంజీవి టైటిల్ పాత్ర‌లో నటించగా.. ఆయ‌న‌కు త‌మ్ముడి పాత్ర‌లో మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించారు. అన్న‌, త‌మ్ముళ్లుగా చిరు, ర‌వితేజ మధ్య స‌న్నివేశాలు, ఎమోష‌న్స్‌, కామెడీ, డాన్సులు అన్నీ ఆడియెన్స్‌ను అల‌రించారు. 

ఇక ఈ సినిమాలో శ్రుతీ హాస‌న్‌ తో పాటు గా క్యాథ‌రిన్ హీరోయిన్ గా నటించి మెప్పించింది. సంక్రాంతి సంద‌ర్బంగా జ‌న‌వ‌రి 13నప్రపంచ వాప్తంగా రిలీజ్ అయిన ఈసినిమా ఇప్ప‌టికే ఓవ‌ర్ సీస్ స‌హా దాదాపు అన్నీ ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యింద‌ని సమాచారం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios