ఎవరూ ఊహించని విధంగా ఓ యంగ్ డైరక్టర్ కు చిరు ఓకే చెప్పినట్లు సమాచారం. ఆ దర్శకుడు మరెవరో కాదు..
మొత్తానికి చిరంజీవి తన తదుపరి చిత్రానికి సైన్ చేసినట్లు సమాచారం. సూపర్ హిట్ 'వాల్తేరు వీరయ్య'తో బాక్సాఫీస్ బరిలో మెగాస్టార్ స్టామినా మరోసారి ప్రూవ్ అయ్యాక...ఆయనకు ఏ డైరక్టర్ తో తన తదుపరి చిత్రం చేయాలనేది భేతాళ ప్రశ్నగా మారింది. ఈ వయస్సులోనూ కమర్షియల్ కథలతో వంద కోట్లు అవలీలగా వసూలు చేసే కెపాసిటీ చిరుకు ఉందని క్లారిటీ వచ్చేయటంతో కొత్త,పాత అనే తేడా లేకుండా వరసపెట్టి దర్శక,నిర్మాతలు కథలు పట్టుకుని ఆయన చుట్టూ ప్రదక్షణాలు చేయటం మొదలెట్టారు. వీరయ్య విజయం తర్వాత చిరంజీవి కూడా కమర్షియల్ కథలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించారు. ఈ క్రమంలో తనకు రెండు మైల్ స్టోన్ మూవీస్ ఇచ్చిన వీవీ వినాయక్, తన అభిమాని పూరి జగన్నాథ్...పేర్లు సైతం పరిగణనలోకి వచ్చాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా ఓ యంగ్ డైరక్టర్ కు చిరు ఓకే చెప్పినట్లు సమాచారం. ఆ దర్శకుడు మరెవరో కాదు..మల్లిడి వశిష్ట.
వశిష్ట... కళ్యాణ్ రామ్ తో చేసిన బింబిసార సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దాంతో ఆయన తదుపరి చిత్రం ఏమిటనేది గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా , వెబ్ మీడియా లలో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రేమలేఖ రాశా సినిమాలో హీరోగా నటించిన వశిష్ట డైరెక్టర్ గా మారి తొలి సినిమాతోనే సక్సెస్ ను అందుకున్నారు. సినిమా రిలీజ్ కు ముందే ఈ సినిమా రిజల్ట్ విషయంలో కాన్ఫిడెన్స్ ఉన్న వశిష్ట తన నమ్మకం నిజమవుతుందని ఈ సినిమాతో ప్రూవ్ చేసుకున్నారు.
బింబిసార సక్సెస్ తో స్టార్ డైరెక్టర్ల జాబితాలో వశిష్ట చేరినట్టే అయ్యింది. బింబిసార సినిమాను చూసిన ప్రేక్షకులెవరూ కొత్త డైరెక్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడంటే నమ్మడం లేదు. ఫస్ట్ సీన్ నుంచి చివరి సీన్ వరకు అనుభవం ఉన్న దర్శకుడిలా వశిష్ట ఈ సినిమాను డీల్ చేయడం గమనార్హం. స్టార్ హీరోలను సైతం హ్యాండిల్ చేయగలనని వశిష్ట ఈ సినిమాతో ప్రూవ్ చేసుకున్నారు. దాంతో చిరంజీవి పిలిచి ఈ దర్శకుడు కథ విని వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే అది ఏ జానర్ ఫిల్మ్ అనేది తెలియాల్సి ఉంది. అలాగే ఈ చిత్రాన్ని వరస పెట్టి చిన్న సినిమాలు తీస్తూ హిట్స్ కొడుతున్న బ్యానర్ నిర్మించబోతున్నట్లు సమాచారం.
మరో ప్రక్క బింబిసార పార్ట్2 కూడా ఉంటుందని కళ్యాణ్ రామ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఫస్ట్ పార్ట్ ను మించిన ట్విస్టులతో ఈ సినిమా తెరకెక్కనుందని బింబిసార పార్ట్2 లో అత్యున్నత గ్రాఫిక్స్ హంగులు ఉంటాయని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు. ఈ ఏడాది బింబిసార2 థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ ఉందా లేదా అనేది ఇప్పుడు డైలమోలో పడింది.
