మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి. రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర తెరకెక్కుతున్న చిత్రం ఇది. ఉయ్యాలవాడ జీవిత చరిత్రపై సినిమా తెరకెక్కించాలని దశాబ్దాలుగా చిరంజీవి ప్రయత్నిస్తున్నారు. 

చివరకు రాంచరణ్ నిర్మాతగా తన సొంత నిర్మాణంలోనే చిరంజీవి సైరా చిత్రంలో నటించారు. అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజవుతోంది. ఈ నేపథ్యంలో అనేక రికార్డులు మెగాస్టార్ చిరంజీవికి దాసోహమవుతున్నాయి. 

యూఎస్ లో ఇప్పటివరకు ప్రీమియర్స్ షోల ద్వారా బ్యాక్ టూ బ్యాక్ 1 మిలియన్ వసూళ్లు రాబట్టిన హీరో ప్రభాస్ మాత్రమే. బాహుబలి చిత్రంతో ప్రభాస్ ఆ రికార్డుని అందుకున్నాడు. కానీ బాహుబలి క్రెడిట్ ఎక్కువగా రాజమౌళికే దక్కుతుంది. బాహుబలి అనేది దేశం దృష్టిని ఆకర్షించి ప్రత్యేక పరిస్థితుల్లో విడుదలైన చిత్రం. 

బాహుబలిని పక్కన పెడితే బ్యాక్ టూ బ్యాక్ యుఎస్ ప్రీమియర్స్ ద్వారా 1 మిలియన్ మార్క్ అందుకున్న మరో హీరో లేడు. తాజాగా ఆ ఘనత మెగాస్టార్ చిరంజీవికే సాధ్యం అవుతోంది. ఖైదీ నెం 150 చిత్ర యుఎస్ ప్రీమియర్స్ కి ఒక మిలియన్ డాలర్లకి పైగా వసూళ్లు నమోదయ్యాయి. తాజాగా సైరా చిత్రం ప్రీమియర్స్ ద్వారా 1 మిలియన్ వసూళ్ళని రాబట్టనుంది.