Asianet News TeluguAsianet News Telugu

వైరల్ వీడియో: వెండితెరపై చిరంజీవి మ్యాజిక్.. నిజం చేసి చూపించిన నీరజ్ చోప్రా

టోక్యో ఒలంపిక్స్ లో అద్భుతం చేసిన నీరజ్ చోప్రా ఒక్కసారిగా నేషనల్ హీరోగా అవతరించాడు. గ్రూప్ లెవల్ నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన నీరజ్.. ఫైనల్ లో చెలరేగి రికార్డు స్థాయిలో 87.58 మీటర్ల దూరం విసిరాడు.

megastar chiranjeevi's iddaru mitrulu video goes viral after neeraj chopra gold medal
Author
Hyderabad, First Published Aug 12, 2021, 3:14 PM IST

టోక్యో ఒలంపిక్స్ లో అద్భుతం చేసిన నీరజ్ చోప్రా ఒక్కసారిగా నేషనల్ హీరోగా అవతరించాడు. గ్రూప్ లెవల్ నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన నీరజ్.. ఫైనల్ లో చెలరేగి రికార్డు స్థాయిలో 87.58 మీటర్ల దూరం విసిరాడు. గోల్డ్ మెడల్ సాధించాడు. నీరజ్ చోప్రా స్టైల్, కాన్ఫిడెన్స్, పడ్డ కష్టం అందరిని ఆకట్టుకుంది. 

వంద ఏళ్ల తర్వాత అథ్లెటిక్స్ లో ఇండియాకు గోల్డ్ తీసుకువచ్చిన వీరుడు నీరజ్ చోప్రా. చారిత్రాత్మక విజయం, గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత సహజంగానే నీరజ్ చోప్రా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలుస్తాడు. అతడిని సూపర్ హీరోలతో పోల్చుతూ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. 

ఇదిలా ఉండగా తెలుగు అభిమానులు మెగాస్టార్ చిరంజీవిని, నీరజ్ చోప్రాని పోల్చుతూ ఓ వీడియో వైరల్ చేస్తున్నారు. చిరంజీవి నటించిన హిట్ మూవీ ఇద్దరు మిత్రులు చిత్రంలోనిది ఆ వీడియో. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవి, సాక్షి శివానంద్, రమ్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. 

ఈ మూవీలో చిరంజీవి సూపర్ స్టైలిష్ గా జావెలిన్ త్రో విసిరే వీడియోని నీరజ్ చోప్రాతో పోల్చుతున్నారు. చిరు జావెలిన్ త్రో విసిరిస్తే ఏకంగా ప్రైజ్ ట్రోఫీ ఉన్న టేబుల్ కు గుచ్చుకుంటుంది. దీంతో చిరు విజయం సాధిస్తాడు. చిరు వెండితెరపై చేసిన మ్యాజిక్ ని నీరజ్ చోప్రా టోక్యో ఒలంపిక్స్ లో నిజం చేశాడు. సిల్వర్, బ్రాంజ్ విజేతలు అతడి దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయారు. 

నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అతడికి అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే. 101 ఏళ్ల తర్వాత ఇండియా అథ్లెటిక్ హిస్టరీని నీరజ్ చోప్రా తిరగరాశారు అని చిరు ప్రశంసలు కురిపించారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios