Megastar Chiranjeevi review on Kishkindhapuri: మెగాస్టార్ చిరంజీవి ‘కిష్కింధపురి’పై రివ్యూ ఇచ్చారు.హారర్‌తో పాటు మంచి సైకాలజికల్ మెసేజ్ అందించిందని పేర్కొన్నారు. బెల్లంకొండ సాయి, అనుపమ నటన, దర్శకుడు కౌశిక్ ప్రతిభపై ప్రశంసలు కురిపించారు.

Chiranjeevi review on Kishkindhapuri: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ - హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన లెటేస్ట్ మూవీ కిష్కింధపురి (Kishkindhapuri).ఈ హార్రర్-థ్రిల్లర్ సెప్టెంబర్ 12న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. ఈ హార్రర్ మూవీకి డైరెక్టర్ కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించగా, షైన్ స్క్రీన్ బ్యానర్‌లో నిర్మాత సాహు గారపాటి నిర్మించారు. ఇక చేతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. తాజాగా ఈ హార్రర్ మూవీపై మెగాస్టార్ చిరంజీవి తన రివ్యూ ఇచ్చారు. ఇంతకీ మెగాస్టార్ ఏమన్నారంటే?

బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు

సాయి శ్రీనివాస్ –అనుపమ పరమేశ్వరన్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ కిష్కింధపురి. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి తెరకెక్కించిన ఈ హారర్ థ్రిల్లర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. వాస్తవానికి కిష్కిందపురి మూవీ తొలి రోజు మిక్స్‌డ్ టాక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు సైకాలజికల్ పాయింట్‌ను మిళితం చేసి చూపించడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారింది. ఇక రెండో రోజు నుంచే కలెక్షన్లు పెరిగాయి. మూడో రోజు వరకు బుకింగ్స్ క్రమంగా పెరుగుతూ, అడ్వాన్స్ బుకింగ్స్ తో హౌస్‌ఫుల్ షోల్ అవుతున్నాయి. ఈ మూవీ నాలుగు రోజుల్లో వర్డల్ వైడ్ గా రూ. 12 కోట్లు కలెక్ట్ చేసినట్టు టాక్.

చిరంజీవి రివ్యూ

తాజాగా కిష్కింధపురి చూసిన మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా స్పందించారు. తన అనుభవాన్ని ఒక వీడియో ద్వారా పంచుకుంటూ, సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. చిరు మాట్లాడుతూ –“మన శంకర వరప్రసాద్ గారు సినిమాను నిర్మాణ సంస్థలో సాహు గారపాటి నిర్మించిన మరో మంచి చిత్రం ‘కిష్కింధపురి’. ఈ సినిమా చూసినప్పుడు చిత్రయూనిట్ మొత్తం నిజంగా గొప్ప ప్రయత్నం చేశారని అనిపించింది. సాధారణంగా హారర్ సినిమాలు భయాన్ని ఎలివేట్ చేస్తూ, దెయ్యం కధతోనే ముగుస్తాయి. కానీ ‘కిష్కింధపురి’లో హారర్‌తో పాటు ఒక సైకాలజికల్ పాయింట్‌ని కూడా చక్కగా చూపించింది. శారీరక వైకల్యం కంటే మానసిక వైకల్యం చాలా ప్రమాదకరమని ఈ సినిమా స్పష్టంగా చెబుతోంది. ఇంత బాగా తెర‌కెక్కించిన దర్శకుడు కౌశిక్ అభినందనీయులు” అని ప్రశంసించారు.

బెల్లంకొండపై చిరు ప్రశంసలు 

ఇక హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌పై గురించి మెగాస్టార్ మాట్లాడుతూ.. “ఈ సినిమా ద్వారా సాయి శ్రీనివాస్ మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే అనుపమ పరమేశ్వరన్ కూడా తన పాత్రలో బాగా ఆకట్టుకుంది. సంగీత దర్శకుడు చైతన్య చేసిన పని సినిమాకు బలం చేకూర్చింది. మొత్తంగా ప్రేక్షకులకు మంచి సినిమా అందించిన నిర్మాత సాహు గారపాటి నిజంగా అభినందనీయులు. “ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న ‘కిష్కింధపురి’ని మీరు తప్పకుండా చూడండి. ఈ సినిమా మిస్ అవ్వకండి” అంటూ ప్రశంసలు కురించారు మెగాస్టార్.

Scroll to load tweet…

మెగాస్టార్ చిరంజీవి నుండి వచ్చిన ఈ ప్రశంసలు ‘కిష్కింధపురి’ టీమ్‌కు ఉత్సాహాన్నిచ్చాయి. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ఈ చిత్రం, చిరంజీవి మాటలతో మరింత పాజిటివ్ బజ్ సొంతం చేసుకుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.