అల్లూరి జయంతి వేడుకలకు చిరంజీవి.. రాజమండ్రిలో ఘన స్వాగతం పలికిన అభిమానులు..
అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రముఖ సినీ నటుడు చిరంజీవి భీమవరం వెళ్లనున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం రాజమండి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న చిరంజీవికి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున మెగా అభిమానులు అక్కడికి తరలివచ్చారు.
ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి రాజమండ్రి ఎయిర్‌పోర్టు వద్ద అబిమానులు ఘన స్వాగతం పలికారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు చిరంజీవి భీమవరం వెళ్లనున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం రాజమండి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న చిరంజీవికి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున మెగా అభిమానులు అక్కడికి తరలివచ్చారు. భారీ గజ మాలతో వెల్‌కమ్ చెప్పారు. ఈ క్రమంలోనే చిరంజీవి వారిని అభివాదం చేస్తూ అక్కడి నుంచి ముందుకు కదిలారు. చిరంజీవి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భీమవరం చేరుకుంటారు.
భీమవరంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగనున్న అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొంటారు. ఆ కార్యక్రమంలో ప్రధాని మోదీ, ఏపీ సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలతో కలిసి చిరంజీవి వేదిక పంచుకోనున్నారు. ఇక, అల్లూరి జయంతి వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఏపీలో పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పంపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవికి.. కిషన్ రెడ్డి ఆహ్వానం పంపారు. ప్రధాని మోదీ పాల్గొనే అల్లూరి జయంతి వేడుకలకు హాజరు కావాల్సిందిగా చిరంజీవిని ఆహ్వానించారు.
Also Read: నేడు భీమవరంకు మోదీ.. అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని.. షెడ్యూల్ ఇదే..
ఇక, అల్లూరి జయంతి వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ప్రముఖ సినీ నటుడు చిరంజీవిలతో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా అల్లూరి కుటుంబ సభ్యులతో మోదీ ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. భీమవరంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరిస్తారు. భీమవరం సమీపంలోని పెదఅమిరంలో బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు.