మెగాస్టార్ చిరంజీవితో పని చేయాలని ఉందని గతంలో చాలా సార్లు సంచలన దర్శకుడు శంకర్ బహిరంగంగానే చెప్పాడు. మెగాస్టార్ కి పెద్ద ఫ్యాన్ ని అంటూ రోబో సమయంలో చిరంజీవి మళ్ళీ వెండితెరపై కనిపించాలని ఎంతో గొప్పగా చెప్పారు. అయితే శంకర్ ఏదైనా అనుకుంటే దాన్ని ఆచరణలో పెట్టడం జరగకుండా ఉండదు. 

అతని మొండితనం ఎంత అందంగా ఉంటుందో అతని బారి బడ్జెట్ సినిమాలే చెబుతాయి. రిజల్ట్ సంగతి పక్కనపెడితే శంకర్ స్టామినా ఏ మాత్రం తగ్గలేదనేది వాస్తవం. మెయిన్ టాపిక్ లోకి వస్తే శంకర్ దర్శకత్వంలో మెగాస్టార్ త్వరలోనే ఓక ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నాడని సమాచారం. ప్రస్తుతం మెగాస్టార్ సైరా సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 

శంకర్ కూడా మరో వైపు కమల్ హాసన్ తో భారతీయుడు సీక్వెల్ ని రూపొందిస్తున్నాడు. ఆ సినిమా ఎండ్ అయ్యే సరికి చిరంజీవి తో చేయనున్న  విజువల్ వండర్ పై స్పెషల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఆ లోపు మెగాస్టార్ కొరటాల శివ ప్రాజెక్టును కూడా ముగించేస్తారని టాక్.