సరిగ్గా 20 ఏళ్ళ తరువాత.. క్రేజీ కాంబినేషన్ తో సినిమా రాబోతోంది. మెగాస్టార్ తో కలిసి హీరోయిన్ గా నటించిన శ్రీయా శరణ్ .. మరోసారి మెగా మూవీలో సందడి చేయబోతుంది.  

దాదాపు 20 ఏళ్ల తరువాత మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ శేర్ చేసుకోబోతోంది హీరోయిన్ శ్రీయా శరణ్. ఇష్టం సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రియ శరణ్ ఈ 23 ఏళ్లలో తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించింది. బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతంచేసుకున్న ఈసీనియర్ బ్యూటీ. స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో వెలుగు వెలిగింది. యంగ్ స్టార్స్ తో పాటు సీనియర్ స్టార్ తో నటించి మెప్పించింది. 

కెరీర్ బిగినింగ్ లోనే శ్రీయా స్టార్ హీరోలతో సూపర్ హట్ సినిమాలు చేసే ఛాన్స్ కొట్టేసింది. అలా నటించిన సినిమానే ఠాగూర్. మెగాస్టార్ చిరంజీవికి జోడీగా శ్రీయా అద్భుతంగా నటిచండంతో పాటు.. చిరుకుపోటీగా స్టెప్పులు కూడా వేసింది. 2003లో వచ్చిన బ్లాక్ బస్టర్ ఠాగూర్ చిత్రంలో చిరు సరసన హీరోయిన్ గా నటించింది. నటనతో పాటు ఎమోషన్స్ కూడా అద్భుతంగా పండించింది. వయసు పెరుగుతున్నా తన అందాన్ని కాపాడుకుంటూ రెండు దశాబ్దాలుగా నటన కొనసాగిస్తున్న శ్రియ ఇప్పుడు మరోసారి చిరుతో స్టెప్పులు వేయనుంది. 

ఇక ఠాగూర్ రిలీజ్ అయిన 20 ఏళ్ల తరువాత.. మెగాస్టార్ తో కలిసిమళ్ళీ స్టెప్పులేయబోతోంది శ్రీయా. చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న బోళా శంకర్‌‌ సినిమాలో ఐటం సాంగ్ కోసం శ్రియను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. చాలా మందిని సంప్రదించిన తర్వాత చిరుతో పోటాపోటీగా నర్తించేది శ్రియనే అని చిత్ర బృందం నిర్ణయానికి వచ్చిందని వినికిడి. అయితే ఈ ఆఫర్ ను వెంటనే ఒకే చేసిందట బ్యూటీ. 

అయితే ఈ సాంగ్ కోసం అదరిపోయే రెమ్యూనరేషన్ ను శ్రీయా డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఈపాట కోసం శ్రీయా దాదాపు కోటి రూపాయలు రెమ్యూనరేషన్ అడిగిందట. మరి ఈ రెమ్యునరేషన్ కు కూడా ఒకే అన్నారంటే.. శ్రీయా వల్ల సినిమాకు ఎంత గ్లామర్ అనుకున్నార ఏమో మేకర్స్..ఇప్పటికే చాలా సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది శ్రీయా.. పెళ్లీ పిల్లల తరువాత కూడా ఏమాత్రం అందం, ఫిట్ నెస్ తగ్గకుండా మెయింటేన్ చేస్తోంది బ్యూటీ.