కార్తిక్ సుబ్బరాజుతో చిరంజీవి సినిమా..? మనసులో మాట బయటపెట్టిన యంగ్ డైరెక్టర్
టాలీవుడ్-కోలీవుడ్ కలయికలో మరో సరికొత్త కాంబినేషన్ కు బీజం పడుతున్నట్టు కనిపిస్తుంది. కోలీవుడ్ యండ్ డైరెక్టర్లకు డిమాండ్ బాగా ఉంది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. మరి ఈ కాంబో సెట్ అవుతుందా..?
టాలీవుడ్ పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటుతున్న క్రమంలో... అన్ని భాషల స్టార్లు.. డైరెక్టర్లు తెలుగుపైఫోకస్ పెంచారు. తెలుగు సినిమాను చీఫ్ గా చూసిన తమిళ, హిందీ సినీ జానాలు కూడా టాలీవుడ్ కు జైజేలు కొడుతున్నారు. ఇక్కడి స్లార్లతో సినిమాలు చేయడానికి డైరెక్టర్లు ఉత్సాహం చూపిస్తున్నారు. తమిళ హీరోలు తెలుగు దర్శకులకు వకాశాలు ఇస్తున్నారు. తెలుగు హీరోలతో తమిళ దర్శకులు సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో తెలుగు-తమిళ కాంబినేషన్ కు బీజం పడుతున్నట్టు కనిపిస్తోంది.
తమిళ ఇండస్ట్రీలో సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్టర్లలో యంగ్ స్టార్ కార్తీక్ సుబ్బరాజు ఒకకరు. సూపర్ స్టార్ రజనీ కాంత్ నే డైరెక్ట్ చేసి.. మెప్పించిన ఈయంగ్ స్టార్... ఆతరువాత సూర్య, ధనుష్, విక్రమ్, విజయ్ సేతుపతి వారితో సినిమాలు చేసి మెప్పించాడు. తమిళనాట స్టార్ డైరెక్టర్ గా చాలా తక్కువ టైమ్ లో ఎదిగాడు కార్తిక్. ప్రస్తుతం కార్తిక్ సుబ్బరాజు శంకర్-రాంచరణ్ కాంబోలో వస్తున్న ఆర్‌సీ 15 కి కథను అందిస్తున్నాడు .
ఈ క్రమలోనే తమిళంలో మరో స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో రామ్ చరణ్ మూవీ ఉంటుంది అని ప్రచారం జరుగుతున్న వేళ.. కార్తీక్ సుబ్బరాజు కూడా టాలీవుడ్ లో మెగా హీరోతో సినిమాచేయబోతున్నారంటూ మాటలు వినిపిస్తున్నాయి. కార్తీక్ రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్‌లో మహాన్ ప్రాజెక్టుతో సందడిచేశాడు.ఈ ప్రాజెక్ట్ తెలుగు, తమిళంలో మంచి ప్రశంసలు అందుకుంటోంది. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన కార్తీక్ తెలుగు సినిమా చేయడం గురించి ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించాడు.
తెలుగులో తనకు అవకాశమొస్తే మెగాస్టార్ చిరంజీవి ని డైరెక్ట్ చేయాలనేది తన కల అని చెప్పాడు కార్తీక్ సుబ్బరాజ్. మొత్తానికి తన మనసులో మాటను బయటపెట్టి చిరంజీవి దృష్టిని ఆకర్షిస్తున్నాడు కార్తీక్ సుబ్బరాజు. రజనీ కాంత్ లాంటి స్టార్ హీరోను కార్తీక్ ఎలా చూపించాడో తెలిసిందే. మరి ఈ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తే.. ఆయన్ను ఎంత డిఫరెంట్ గా చూపిస్తాడో అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కార్తీక్ కు మెగా ఛాన్స్ ఇస్తే బాగుండు అనకుంటున్నారు.
చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. మంచి కథతో వస్తే రజనీ కాంత్ మాదిరిగా యంగ్ డైరెక్టర్లతో పనిచేయడానికి ఆయన సై అంటున్నాడు. ఈక్రమంలోనే వెంకీ కుడుములకు అవకాశం కూడా ఇచ్చాడు మెగాస్టార్. యువ దర్శకులతో పనిచేయడానికి రెడీ అంటున్న తరుణంలో మరి కార్తీక్ సుబ్బరాజు గురించి చిరు ఏం నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. భవిష్యత్‌లో వీరి కాంబినేషన్‌లో సినిమా వస్తే మాత్రం తప్పకుండా సమ్‌థింగ్ స్పెషల్ సినిమాగా ఉండటం పక్కా అని ఇండస్ట్రీలో అప్పుడే డిస్కర్షన్స్ స్టార్ట్ అయ్యాయి.