Megastar Movie Title: మెగా మూవీ టైటిల్ పై డైరెక్టర్ కసరత్తులు… అందరూ అనుకునేదేనా..?
వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi). ఇప్పటికే చిరంజీవి ఆరు సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఇక అన్ని సినిమాలకు టైటిల్ ఫిక్స్ అవ్వగా బాబీ సినిమాకు మాత్రం ఇంకా టైటిల్ కసరత్తు చేస్తూనే ఉన్నారు.
వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi). ఇప్పటికే చిరంజీవి ఆరు సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఇక అన్ని సినిమాలకు టైటిల్ ఫిక్స్ అవ్వగా బాబీ సినిమాకు మాత్రం ఇంకా టైటిల్ కసరత్తు చేస్తూనే ఉన్నారు.
మెగాస్టార్ తన సినిమాలతో బిజీ బిజీ. కరోనా థార్డ్ వేవ్ కూడా వెళ్లిపోయింది. ఎపీలో టికెట్ల ఇష్యూ కూడా దాదాపు కొలిక్కి వచ్చినట్టే.. ఇక రిలీజ్ కు రెడీ అవ్వచ్చు అని ఫిక్స్ అయ్యారు టీమ్. ఆచార్య ఇప్పటికే రెండు మూడు డేట్లు మార్చుకుని మూడోసారి ముచ్చటగా రీలీజ్ కు ముస్తాబవుతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఈసినిమాలో మెగాస్టార్(Megastar Chiranjeevi) తో స్క్రీన్ శేర్ చేసుకున్నారు.
ఇక ఆచార్య(Acharya) సినిమా రిలీజ్ కు రెడీగా ఉంటే.. మెగాస్టార్(Megastar Chiranjeevi) నెక్ట్స్ మూవీ గాడ్ ఫాదర్ సెట్స్ లో ఉంది. రీసెంట్ గా ఆ మూవీ సెట్ లో జాయిన్ అయ్యారు మెగాస్టార్. ఈసినిమా కూడా మరో నెలలో రిలీజ్ కు మూస్తాబు అయ్యే అవకాశం ఉంది. ఇక రీసెంట్ గా ఓపెనింగ్ అయ్యింది మెగాస్టార్(Megastar Chiranjeevi) – మెహార్ రమేష్ సినిమా. ఈమూవీ కూడా సెట్స్ లోకి వెళ్లబోతోంది. అటు బాబీతో మాస్ మూవీ కమిట్ అయిన చిరంజీవి ఈ మూవీని కూడ ఓపెనింగ్ చేశారు. మరో వైపు వెంకీ కుడుములతో సినిమా త్వరలో పట్టాలు ఎక్కబోతోంది.
అయితే చిరంజీవి(Megastar Chiranjeevi) బాబీ సినిమాకు ఇంత వరకూ టైటిల్ అనౌన్స్ చేయలేదు. బాబీ సినిమాతరువాత అనౌన్స్ చేసిన మెహర్ రమేష్ మూవీకి భోళా శంకర్ టైటిల్ ను అనౌన్స్ చేశారు టీమ్. ఫస్ట్ లుక్ టీజర్ కూడా ఇచ్చేశారు. బాబీ తో చిరంజీవి చేస్తున్న సినిమాకు టైటిల్ పై ఇంకా కసరత్తు చేస్తన్నట్టు తెలుస్తోంది.
అయితే ఈ సినిమాకు మొదటి నుంచీ ఒక టైటిల్ బాగా జనాల్లో నానుతుంది. వాల్తేరు వీరయ్య టైటిల్ తో మాస్ మసాల స్టోరీని మెగాస్టార్ (Megastar Chiranjeevi) కోసం రాసుకున్నారట బాబీ. ఈ టైటిల్ లే దాదాపు ఫిక్స్ అవుతుంది అని సమాచారం. దీనితో పాటు మరికొన్ని టైటిల్స్ ను పక్కన పెట్టుకుని.. సెలక్ట్ చేసే పనిలో ఉందట మెగా టీమ్.