Asianet News TeluguAsianet News Telugu

తెలుగు సినిమాకి చిరంజీవి త్రినేత్రుడు..మెగాస్టార్ పై వెంకయ్య నాయుడు కామెంట్స్

ఇద్దరు పద్మ విభూషణులు ఒకే చోట కలిసి.. విరిసి..అభిమానులకు కనువిందు చేశారు. మెగాస్టార్ చిరంజీవి - వెంకయ్య నాయుడు ఇద్దరు ఒకరికొకరు సత్కరించుకున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 
 

Megastar Chiranjeevi Meeting with Venkaiah Naidu For Receiving Padma Vibhushan Awards JMS
Author
First Published Jan 26, 2024, 8:28 PM IST

ఈరోజు ( జనవరి 26) రిపబ్లిక్ డే  సందర్భంగా పద్మ అవార్డులని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. నిన్న సాయంత్రమే ఈ అవార్డ్ లను  ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఐదుగురు ప్రముఖులకు  పద్మ విభూషణ్ అవార్డుతో పాటు.. 17 మందికి ప్రముఖులకు  పద్మ భూషణ్ అవార్డులు, 110 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు. ఇక ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు స్టార్లు ఉండగా.. అందులో ఇద్దరు ప్రముఖులకు అత్యున్నద పద్మ విభూషన్ ప్రకటించింది కేంద్రం. 

అందులో  భాగంగా మెగాస్టార్ చిరంజీవికి సినీరంగానికి చేసిన సేవకుగాను భారతదేశ రెండో అత్యున్నత అవార్డు పద్మ విభూషణ్ ప్రకటించారు. అంతే కాదు రాజకీయాల్లో అజాతశత్రువుగా, సౌమ్యుడిగా..బహుముఖ మేధావిగా, వక్తగా పేరుగాంచిన మాజీ ఉపరాష్ట్రపతి  తెలుగు సీనియర్ రాజకీయ నాయకులు వెంకయ్య నాయుడుకు కూడా పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించారు. దాంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు హర్షిస్తున్నారు. ప్రముఖులతో  పాటు సామాన్యులు, సెలబ్రిటీలు అన్న తేడా లేకుండా.. వీరిరువురకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

 

ఇది ఇలా ఉండగా.. తాజాగా ఇద్దరు పద్మవిభూనులు ఒక చోట చేరి సందడి చేశారు. ఒకరినొకరు సత్కరించుకుని అభిమానులకు ఆనందపరిచారు. మెగాస్టార్ చిరంజీవి నేడు సాయంత్రం వెంకయ్యనాయుడు వద్దకు స్వయంగా వెళ్లి శాలువాతో సత్కరించి అభినందించారు. వెంకయ్యనాయుడు కూడా చిరంజీవిని సత్కరించారు.చిరంజీవి ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. వెంకయ్యనాయుడుని కలిసి  ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆయన. 

ఈ సందర్భంగా ఆయన ఓ నోట్ రాశారు. సంతోషకరమైన క్షణాలను వెంకయ్యనాయుడు గారితో పంచుకున్నాను. ప్రతిష్టాత్మకమైన గౌరవం అందుకున్నందుకు తోటి గ్రహీతలుగా ఒకరినొకరు అభినందించుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు. దీంతో ఇద్దరు పద్మ విభూషణులు, తెలుగు వారికి గర్వకారణమైన ఇద్దరు దిగ్గజాలు ఒకే ఫొటోలో ఉన్నారు అంటూ అభినందనలు కురిపిస్తూ ఈ ఫొటోలను వైరల్ చేస్తున్నారు.

ఒకే ప్రాంతానికి చెందిన ఇద్దరు ప్రముఖులకు పద్మవిభూషణ్‌ లభించటం చాలా అరుదు. వారిద్దరు స్నేహితులు కావటం.. సమాజాభివృద్ధి కోసం పనిచేసినవారు కావటం ఇంకా అరుదుు. అలాంటి సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పద్మవిభూషణ్‌ పురస్కార గ్రహీతలు మాజీ ఉపాధ్యక్షులు వెంకయ్యనాయుడు, మెగాస్టార్‌ చిరంజీవిలు శుక్రవారం సాయంత్రం కలుసుకున్నారు. ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. జైఆంధ్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో నేను కాలేజీలో చదువుతున్నా. ఆ సమయంలో వెంకయ్యనాయుడు గారు విద్యార్థి ఉద్యమనేత. ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మేము కాలేజీలు బహిష్కరించి ఉద్యమంలో పాల్గొన్నాం.

నాకు ఆయన ఆ రోజు నుంచి తెలుసు’’ అని చిరంజీవి తన కాలేజీ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత  తాను సినిమాలలోకి వచ్చానని.. ఆయన రాజకీయాల్లో ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగారయని మెగాస్టార్‌ పేర్కాన్నారు. కొద్దికాలం తర్వాత మేమిద్దరం పార్లమెంట్‌లో కొలిగ్స్‌గా ఉన్నాం. అనేక విషయాలు ఆయనను అడిగి తెలుసుకొనేవాడిని. సమాచార విషయంలో ఆయన నాకు స్ఫూర్తి అని వెల్లడించారు. వెంకయ్యనాయుడు గారు స్వయంకృషితో ఎదిగిన వ్యక్తి అని ఆయనను చూసి అందరూ నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నారు. వెంకయ్యనాయుడు గారి తో పాటుగా తనకు కూడా పద్మవిభూషణ్‌ రావటంతో తన ఆనందం ద్విగిణికృతమయిందన్నారు. ఇద్దరు తెలుగువాళ్లం.. స్నేహితులం. మాకు ఒకేసారి ఒకే అవార్డు రావటం థ్రిల్లింగ్‌ అనిపించింది. మేమిద్దరం కలుసుకొని జ్ఞాపకాలు నెమరువేసుకున్నాం’’ అన్నారు. 

మూడో కన్ను..తెలుగు సినీ రంగానికి ఎన్టీఆర్‌, ఏఎన్నాఆర్‌ రెండు కళ్లు అయితే– చిరంజీవి మూడో కన్ను అని వెంకయ్యనాయుడు గారు అభివర్ణించారు. ఈ అవార్డు రావటానికి అన్ని అర్ఞతలు మీకు ఉన్నాయి. మీరు కష్టపడి ఒకో అడుగు వేసుకుంటూ– ఎవరూ ఊహించని ఎత్తుకు ఎదిగారు’’ అని వెంకయ్యనాయుడు గారు మెగాస్టార్‌ను ప్రశంసించారు. సరైన సమయంలో ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకుందని ప్రశంసించారు. సో ప్రౌడ్‌ ఆఫ్‌ యూ అని మెగాస్టార్‌ను ప్రశంసించి సత్కరించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios