చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కు 25 ఏళ్లు.. ‘మహాత్మకు ఇదే మన నివాళి’.. మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ నోట్..
మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్థాపించి 25 ఏళ్లు పూర్తైంది. ఈరోజు మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా చిరు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఇంట్రెస్టింగ్ నోట్ తో గాంధీజీకి నివాళి అర్పించారు.
మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో హీరోగా అగ్రస్థాయికి చేరుకున్నారు. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు. ఇక అదే స్థాయిలో సేవా కార్యక్రమాలనూ చేస్తూ వస్తున్నారు. ఈక్రమంలో 1998 అక్టోబర్ 2న చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ను ప్రారంభించారు. దీనితోపాటు చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్స్ ను స్థాపించిన విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ బ్యాక్ చాలా పెద్దది. అయితే గాంధీ జయంతి రోజునే ఈ బ్లడ్ బ్యాంక్ ను స్థాపించడం విశేషం. నేటితో Chiranjeevi Blood Bank ప్రారంభించి 25 ఏళ్లు పూర్తైంది.
ఈ సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి ఆసక్తికరమైన నోట్ విడుదల చేశారు. ట్వీట్ లో.. ’మన దేశానికి ఇది ముఖ్యమైన రోజు. నేను చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ (సిసిటి) ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తైంది. అద్భుతమైన ప్రయాణం ట్రస్ట్ పై ప్రేమను ప్రతిబింబిస్తోంది. ఇప్పటి వరకు 10 లక్షలకు పైగా యూనిట్ల రక్తాన్ని సేకరించి పేదలకు అందించాం. కంటి పంపిణీ ద్వారా 10 వేల మందికి పైగా కంటి చూపు తిరిగి వచ్చింది. కరోనా మహమ్మారిలో వేలాది మంది ప్రాణాలు రక్షించాం. మరెన్నో సేవలు అందించాం.
మన తోటి మానవులకు ఇలా సేవ చేయడంతో మనం పొందే సంతృప్తి అసమానమైనది. అమూల్యమైనది. CCT మానవతా కార్యక్రమాలను శక్తివంతం చేసి, మా సామూహిక మిషన్‌కు శక్తినిచ్చిన లక్షలాది మంది ఉదార సోదరులు, సోదరీమణులకు సెల్యూట్ చేస్తున్నాను! ఇది మన దేశానికి చేస్తున్న సహకారం! ఇదే మహాత్ముడికి మనం అర్పించే నివాళి’ అంటూ రాసుకొచ్చారు. ఇక మహాత్మగాంధీ జయంతి వేడుకులను దేశ శ్యాప్తంగా జరుపుతున్నారు. గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్నారు.