మెగాస్టార్ మంచి మనసు, కాళ్లుపోయిన సీనియర్ నటుడిని ఆదుకున్నచిరంజీవి

ప్రస్తుతం ఇండస్ట్రీకి పెద్దన్నగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఎవరికి ఏకష్టం వచ్చినా.. నేనున్నా అంటూ ధైర్యం ఇస్తున్నారు. అయితే ఓ 30 ఏళ్ళ క్రితమే ఆయన ఓ సీనియర్ నటుడిని ఆదుకున్నా. ఆయన ఒక్కరినే కాదు.. ఎందరికో ఆపన్న హస్తం అందించారు. 

Megastar Chiranjeevi Helps Tollywood Senior Actor Nutan Prasad JMS

ప్రస్తుతం ఇండస్ట్రీకి పెద్దగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆయన పెద్ద దిక్కుగా ఉన్నారు. ఇండస్ట్రీ ఇబ్బందులు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి.. తన సొంత కుటుంలా టాలీవుడ్ ను చూసుకుంటున్నారు చిరు. ఇప్పుడే కాదు ఎప్పటి నుంచి ఆయన ఆర్టిస్ట్ పట్ల మంచి మనసు చూపిస్తూనే ఉన్నారు. కష్టాల్లో ఉన్న తోటి ఆర్టిస్ట్ లతను ఆదుకోవడంలో మెగా స్టార్ ముందుంటారు. దీనికి నిదర్శనమే.. రెండు దశాబ్ధాల క్రితం జరిగిన సంఘటన. ఆ టైమ్ లో తన కో ఆర్టిస్ట్ ను మెగాస్టార్ ఆదుకోవడమే కాదు.. ఆపన్న హస్తం అందించారు. 

నూతన్ ప్రసాద్ చాలామందికి గుర్తుండే ఉంటాడు. చిరంజీవి సినిమాల్లో ఎక్కువగా విలన్ పాత్రలు చేసిన ఆయన.. కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బాగా పాపులర్ అయ్యాడు. కాని విధి అలా ఉండనివ్వదు కదా.. బామ్మ మాట బంగారు బాట సినిమా లో భాగంగా ది గ్రేట్ లెజెండరీ ఆర్టిస్ట్ అయిన నూతన ప్రసాద్ గారు ఒక పెద్ద ప్రమాదానికి గురయ్యారు. దాంతో ఆయన రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. ఇక అప్పటి నుంచి ఆయన నిలబడి నడవ లేకుండా అయిపోయాడు. దాంతో ఆయన వీల్ చైర్ కే పరిమితమయ్యాడు. 

ఆ పరిస్థితి వల్ల నూతన ప్రసాద్ కి  రకరకాల  ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయి. హెల్త్ పరంగా.. ఆర్ధికంగా నిలబడలేకపోయారు. కాళ్ళు పోవడంతో.. నూతన్ ప్రసాద్ కు సినిమాలు లేకుండాపోయాయి. ఆయనని సినిమాలో తీసుకోవడానికి ఎవరు ముందుకు రాలేదు. అలాంటి పరిస్థితుల్లో మంచి మనసుతో తన కో ఆర్టిస్ట్ ను ఆదుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ధన సహాయంతో పాటు.. సినిమాల్లో పాత్రలు కూడా ఇప్పించారు. నిలబడి నటించలేకపోతే ఏమైయ్యింది.. వీల్ చైర్ లో ఉండి కూడా అద్భుతంగా నటించారు. ఆయనలో ఆ తపనకు మెగాస్టార్ సాయం తోడై.. సినిమాలు చేయడం స్టార్ట్ చేశారు. 

Megastar Chiranjeevi Helps Tollywood Senior Actor Nutan Prasad JMS

 చిరంజీవి తన సినిమాల్లో ఏవైనా క్యారెక్టర్లు ఉంటే వాటిని ఆయన చేత చేయించడానికి ఎక్కువ ప్రయత్నించేవారు మాస్టర్ సినిమాలో ఒక క్యాంటీన్ ఓనర్ గా తన చేత నటింపజేశాడు చిరు. ఆయన వీలైనన్ని ఎక్కువ సీన్లలో కనిపించేలా కూడా చిరంజీవి దర్శకుడితో మాట్లాడి  జాగ్రత్తలు తీసుకుని.. నూతన్ ప్రసాద్ కు ఆ గౌరవం దక్కేలా చేశార. తను ఖాళీగా ఉంటే ఎప్పుడూ ఇబ్బంది పడతాడు, బాధపడతాడనే ఉద్దేశ్యంతో తనని ఎప్పటికప్పుడు బిజీగా ఉంచే ప్రయత్నం అయితే చేశాడు.

మాస్టర్ సినిమా తరువాత నూతన్ ప్రసాద్ కు వరుస అవకాశాల వచ్చాయి. వీల్ చైర్ లో కూడా  ఆయన నటన చూసిన కొంతమంది ఆయనకి వీల్ చైర్ లో కూర్చునే క్యారెక్టర్లు ఇచ్చి  ప్రోత్సహించారు. అలాగే  సినిమాలు చేస్తూ.. బుల్లితెరపై డబ్బింగ్ చెపుతూ.. నూతన్ ప్రసాద్ మళ్ళీ పుంజుకున్నారు. ఆతరువాత బుల్లితెరపై.. నేరాలు-ఘోరాలు ప్రోగ్రామ్ కి కూడా తన వాయిస్ ఇచ్చి చాలా ఫేమస్ కూడా అయ్యాడు…

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios