ఎందరోజీవితాల్లో వెలుగు నింపారు మెగాస్టార్ చిరంజీవి, ఎంతో మందిని ఆర్ధికంగా ఆదుకున్నారు. ఎవరికీ తెలియని గుప్త దానాలు ఎన్నో చేశారు చిరు. తాజాగా అలాంటిదే ఒకటి రీసెంట్ గా బయటకు వచ్చింది.  

మెగాస్టార్ చిరంజీవి.. టాలీవుడ్ లో స్టార్ హీరో.. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు. ఇండస్ట్రీకే కాదు. ఏ ఆర్టిస్ట్ కు అయినా.. సమస్య ఉంటే మెగాస్టార్ ఆసమస్య తీర్చడంలో ముందుంటారు. కరోనా టైమ్ లో ఇండస్ట్రీని ఆదుకోవడం కోసం ఫండ్ కలెక్ట్ చేయడంతో పాటు.. దగ్గరుండి ఆర్టిస్ట్ లను ఆదుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. అంతే కాదు చావుబ్రతుకుల మధ్య ఉన్న ఎందరో అభిమానులకు తన సాయంతో ఊపిరి పోశారు. ఇవే కాదు.. ఎవరికీ తెలియని గుప్త దానాలు ఎన్నో చేశారు మెగాస్టార్. 

తాజాగా మెగాస్టార్ కు సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా మెగాస్టార్ సేవా కార్యక్రమాలను ఆపలేదు. కష్టాల్లో ఉన్నవారికి తనవంతు సహాయం చేయడం ఆయనకు అలవాటు. ఆయన దాన గుణం మరోమారు బయటపడింది. తాను చదువుకున్న వైఎన్ కాలేజీకి చిరు ఎంపీగా ఉన్న టైమ్​లో 50 లక్షల నిధులు మంజూరు చేశారట. ఈ విషయాన్ని ఆ కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ సత్యనారాయణ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

అంతే కాదు టాలీవుడ్ దిగ్గజ తారలు దాసరి నారాయానణ రావుతో పాటు... కృష్ణంరాజు, చిరంజీవి, దవళ సత్య, అనంత్ శ్రీరామ్ లాంటి గొప్పవారు ఈ కాలేజీలో చదివినట్టు ఆయన తెలిపారు. చిరుతో పాటు దాసరి, కృష్ణం రాజు కూడా ఎంపీలుగా ఉన్నప్పుడు కాలేజీ డెవలప్ మెంట్ కోసం 10 లక్షల వరకూ నిధులు రిలీజ్ చేవారన్నారు. ఇక మెగాస్టార్ 50 లక్షలతో పాటు.. తన సొంతంగా.. కూడాకొంత కాలేజీ డెవలప్ మెంట్ కు ఇస్తానని మాటిచ్చారట. ఈ విషయం తెలిసి మెగా ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. 

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో పుల్ బిజీగా ఉన్నారు. మెహర్ రమేష్ డైరెక్షన్ లో భోళా శంకర్ సినిమా షూటింగ్ లో ఉన్నారు చిరంజీవి. ఈసినిమాలో హీరోయిన్ గా మిల్క్ బ్యూటీ తమన్నా నటించగా.. మెగాస్టార్ చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటించింది. ప్రస్తుతం కోల్ కతాలో షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ ఏడాది వాల్తేరు వీర్య సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు మెగాస్టార్ చిరంజీవి.