Asianet News TeluguAsianet News Telugu

వరుణ్ తేజ్ - లావణ్యకు శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్.. ‘సంతోషంగా జీవించాలం’టూ చిరు విషెస్..

వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా జరిగింది.  వేడుకకు మెగా ఫ్యామిలీ హాజరై సందడి చేసింది. ఒక్కటి కాబోతున్న జంటకు శుభాకాంక్షలు తెలిపుతున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి స్పెషల్ గా విష్ చేశారు. 
 

Megastar Chiranjeevi Heartly Congratulations to Varun Tej and Lavanya Tripathi NSK
Author
First Published Jun 10, 2023, 1:54 PM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) - లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)   నిశ్చితార్థం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. మెగా ఇంట పెళ్లి సందడి మొదలు కావడంతో అభిమానులు, సినీ తారలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎంగేజ్ మెంట్ కు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరై వారి ఆశీర్వదించింది.  మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అల్లు అర్జున్, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, ఉపాసనతో పాటు లావణ్య త్రిపాఠి కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. 

ఇక తాజాగా మరోసారి సోషల్ మీడియా వేదికన మరోసారి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్పెషల్ గా ట్వీట్ చేస్తూ విషెస్ తెలిపారు. ట్వీట్ చేస్తూ..  ’లావణ్య - త్రిపాఠి ఎంగేజ్ మెంట్ జరగడం సంతోషకరం. మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మీరు వండర్ ఫుల్ కపుల్ గా నిలవాలని కోరుకుంటున్నాను. మీకు అందరి ప్రేమ, ఆనందం అందాన్ని, మున్ముందుకు చక్కటి జీవితాన్ని చూడాలని ఆకాంక్షిస్తున్నాను.’ అంటూ ట్వీట్ చేశారు. చిరు స్పెషల్ విషెస్ కు సంబంధించిన ట్వీట్ వైరల్ గా మారింది.

ట్వీట్ చేస్తూ చిరంజీవి బ్యూటీఫుల్ ఫొటోను పంచుకున్నారు. వరుణ్ తేజ్ - లావణ్య  ఒకరికొకరు రింగులు మార్చుకుంటుండగా.. ఆ శుభ సందర్భాన్ని చూస్తూ చిరంజీవి - సురేఖ సంతోషిస్తున్న ఫొటోనుషేర్ చేసుకున్నారు. అలాగే సొషల్ మీడియా వేదికన సినీ తారలు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వీరిద్దరూ ఒక్కటి కాబోతుండటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వేడుకను హైదరాబాద్ లొ చాలా గ్రాండ్ గా నిర్వహించారు. 

ఇక ఐదేళ్ల పాటు ప్రేమాయణం కొనసాగించిన వరుణ్ - లావణ్య ఎట్టకేళలకు నిశ్చితార్థం చేసుకున్నారు. గ్రాండ్ ఏర్పాట్ల మధ్య వేడుక జరిగింది. లావణ్య, వరుణ్ సంప్రదాయ దుస్తులు కూడా ఆకట్టుకున్నాయి. ఎంగేజ్ మెంట్ పూర్తవడంతో ప్రస్తుతం పెళ్లిపై అందరి చూపు పడింది. తాజా సమాచారం ప్రకారం.. ఇటలీలో వీరి పెళ్లి వేడుక జరగనుందని తెలుస్తోంది. అయితే ఈ ఏడాది చివర్లో వెడ్డింగ్ ఉంటుందని సమాచారం. 

 

Follow Us:
Download App:
  • android
  • ios