సల్మాన్ ఖాన్ వల్ల మెగా ఈవెంట్ క్యాన్సిల్ అవ్వబోతోందా...? చిరంజీవి ఏం చేయబోతున్నారు..?

గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ గురించి చాలా అనుకున్నారు.. చాలా గ్రాండ్ గా చేద్దాం అనుకున్నారు.. కాని అనకున్నవన్నీ జరిగేలా లేవు. చాలా ప్లానింగ్స్ చేస్తే.. ఆశలన్నీ ఆవిరయినట్టు కనిపిస్తోంది. అది కూడా సల్మాన్ వల్ల జరిగిందట. ఇంతకీ అసలేమైంది.

Megastar Chiranjeevi Godfather Movie pre release event Update

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా  గాడ్ ఫాదర్. పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ  సినిమాను వచ్చే నెల దసరా కానుకగా అక్టోబర్ 5 న రిలీజ్ చేయాలని పిక్స్ అయ్యారు. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో.. ప్రమోషన్స్ మీద గట్టిగా దృష్టి పెట్టారు టీమ్. మోగాస్టార్  చిరంజీవి కూడా ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు టీమ్. 

కొన్ని రోజులుగా ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ పై రకరకాల వార్తలు వినిపించాయి. ఈ ఈవెంట్ ను  అనంతపురంలో భారీ ఎత్తున చేయాలనుకుంటున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఈ ఈవెంట్ కు కూడా  పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆతరువాత ఇక్కడ ఈ ఈవెంట్ ను నిర్వహించే ఆలోచన లేదంటూ మరో వార్త బయటకు వచ్చింది. ప్రీరిలీజ్ ను అనంతపురంలోనో.. లేక హైదరాబాదులో నిర్వహించడానికి బదులుగా ముంబాయిలో చేయాలని అనుకున్నారట. అది కూడా  సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా భారీ ఎత్తున గాడ్ ఫాదర్ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ను ప్లాన్ చేస్తున్నారట. 

దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా షురూ అయినట్టు సమాచారం. అయితే ఈ క్రమంలోనే మరో షాకింగ్ న్యూస్ మెగా ఫ్యాన్స్ ను నిరుత్సాహపరుస్తోంది. ముంబయిలో అనుకున్న ఈ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యే అవకాశాల కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ ఈఈవెంట్ కు వచ్చే అవకాశం లేనందున.. అక్కడ ఈవెంట్ జరగదంటున్నారు. సల్మాన్ ఖాన్ ని చంపేస్తాం అంటూ కొందరు బెదిరిస్తున్న నేపథ్యంలో ఆయన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనడం సేఫ్ కాదని సెక్యూరిటీ నుంచి ఇన్ ఫర్మేషన్ వచ్చిందట. అందకుకేఆయన రావడం  అనుమానంగా మారింది. దాంతో అసలు ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందా లేదా అనే అనుమానం కూడా తలెత్తుతుంది.

చిరంజీవి కోసం ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ముఖ్య పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అందుకే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని అక్కడ ప్లాన్ చేశారు. కానీ సల్మాన్ ఖాన్ హాజరు కాకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబైలో నిర్వహించడం వృధా అని మూవీటీమ్ భావిస్తోంది. అందుకే అక్కడ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందా లేదా అనేది సస్పెన్స్ గా మారింది.మోహన్ లాల్ నటించిన మలయాళ మూవీ లూసిఫర్ కు గాడ్ ఫాదర్ తెలుగు రీమక్ గా తెరకెక్కింది. ఈసినిమాలో చిరు సరసన నయనతార హీరోయిన్ గా నటించింది. రీసెంట్ గా ఆమె ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఇక తమన్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios