ఆచార్య సెట్స్ పై ఉండగానే చిరంజీవి మొత్తం మూడు ప్రాజెక్ట్స్ ప్రకటించారు. వాటిలో మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న భోళా శంకర్ ఒకటి. తమిళ హిట్ మూవీ వేదాళం తెలుగు రీమేక్ గా Bhola Shankar నిర్మిస్తున్నారు.

యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ వరుస ప్రాజెక్ట్స్ ప్రకటిస్తున్నారు. ప్రకటించడమే కాకుండా వాటిని చకా చకా సెట్స్ పైకి తీసుకెళుతూ జోరు చూపిస్తున్నారు. దర్శకుడు కొరటాల శివతో చేస్తున్న ఆచార్య షూట్ పూర్తి చేసిన చిరంజీవి... సినిమా విడుదల తేదీ కూడా ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 4న Acharya భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఆచార్య మూవీలో చరణ్ మరో కీలక రోల్ చేస్తున్నారు. ఆయనకు జంటగా పూజా హెగ్డే నటిస్తున్నారు. చిరు- Ram charan కలిసి చేస్తున్న పూర్తి స్థాయి మల్టీస్టారర్ ఈ మూవీ అని చెప్పవచ్చు. 

ఆచార్య సెట్స్ పై ఉండగానే చిరంజీవి మొత్తం మూడు ప్రాజెక్ట్స్ ప్రకటించారు. వాటిలో మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న భోళా శంకర్ ఒకటి. తమిళ హిట్ మూవీ వేదాళం తెలుగు రీమేక్ గా Bhola Shankar నిర్మిస్తున్నారు. ఫార్మ్ లో లేక సతమతమైన మెహర్ రమేష్ చాలా కాలం తరువాత మెగాస్టార్ తో మూవీ ఓకె చేయడం, సంచలన విషయం. ఈ మూవీలో చిరు చెల్లెలుగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటించడం కొసమెరుపు. 

Also read చిరంజీవి వాయిస్ ఓవర్ ఇస్తున్నారు,హ్యాపీ
ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భోళా శంకర్ చిత్రం సెట్స్ పైకి వెళ్ళడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. నవంబర్ 11న భోళా శంకర్ మూవీ పూజా కార్యక్రమం జరగనుంది. అదే నెల 15 నుంచి మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. భోళా శంకర్ మూవీపై తాజా అప్డేట్ ఫ్యాన్స్ లో జోష్ నింపుతుంది. 

Also read సాయిధరమ్ తేజ్ లేటెస్ట్ హెల్త్ అప్ డేట్
వీటితో పాటు మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్, దర్శకుడు బాబీ దర్శకత్వంలో మరో చిత్రాన్ని చిరంజీవి ప్రకటించారు. మొత్తంగా రానున్న రెండేళ్ల కాలంలో చిరు నుండి క్రేజీ ప్రాజెక్ట్స్ రానున్నాయి. మెగా ఫ్యాన్స్ చిరు వరుస రిలీజ్ లతో పండగ చేసుకోనున్నారు. 66ఏళ్ల చిరు.. ఈస్థాయిలో చిత్రాలు చేయడం నిజంగా గొప్ప విషయం. 

Scroll to load tweet…