మెగా ప్రేమ:కూతురుకు కాస్ట్లీ గిప్ట్..ఇంత భారీగానా?

 తన కుమార్తె శ్రీజ కోసం ఓ భారీ ఇన్విస్టిమెంట్ ని ఇవ్వబోతున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఓ పోష్ లొకేషన్ లో 1200 యార్డ్ ల స్ధలం తీసుకుని అక్కడ ఇల్లు కట్టిస్తున్నారని వినపడుతోంది. కోట్ల విలువ చేసే ఆ గిప్ట్ తో ఖచ్చితంగా శ్రీజ ఉక్కిరిబిక్కిరి అవ్వటం ఖాయం అంటున్నారు. తన పిల్లల కోసం నిరంతరం ఆలోచించే ఆయన ఇలాంటివి చాలా చేస్తూంటారు. తన అభిమానులతో ఎంతో ప్రేమను పంచే ఆయన ఫ్యామిలీకు ఇవ్వటంలో వింతేముంది.

Megastar Chiranjeevi buys expensive property for Sreeja jsp


మెగాస్టార్ చిరంజీవి తన కుమార్తెలంటే ఎంత ప్రేమో తెలిసిందే. ఆ ప్రేమను ఆయన చాలా రకాలుగా వ్యక్తం చేస్తూంటారు. వాళ్లకేం కావాలన్నా ఇవ్వటానికి ఆయన వెనకాడరు. అలాగే వాళ్లు అడగనవి కూడా బహుమతుల రూపంలో ఇచ్చి ఆనందపరుస్తూంటారు. ఆయన కడుపున పుట్టడం తమ అదృష్టం వాళ్లు ఫీలయ్యేలా మెగాస్టార్ ప్రవర్తన ఉంటుందని చెప్తారు. తాజాగా ఆయన తన కుమార్తె శ్రీజ కోసం ఓ భారీ ఇన్విస్టిమెంట్ ని ఇవ్వబోతున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఓ పోష్ లొకేషన్ లో 1200 యార్డ్ ల స్ధలం తీసుకుని అక్కడ ఇల్లు కట్టిస్తున్నారని వినపడుతోంది. కోట్ల విలువ చేసే ఆ గిప్ట్ తో ఖచ్చితంగా శ్రీజ ఉక్కిరిబిక్కిరి అవ్వటం ఖాయం అంటున్నారు. తన పిల్లల కోసం నిరంతరం ఆలోచించే ఆయన ఇలాంటివి చాలా చేస్తూంటారు. తన అభిమానులతో ఎంతో ప్రేమను పంచే ఆయన ఫ్యామిలీకు ఇవ్వటంలో వింతేముంది.

ప్రస్తుతం చిరంజీవి ...ఆచార్య షూటింగ్ లో బిజీగా ఉంటున్నారు. చిరంజీవి కీలక పాత్రలో కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ సినిమాలంటే కమర్షియల్‌ హంగులతో పాటు సామాజిక సందేశంతో కూడి ఉంటాయి. చిరు ఇందులో మధ్య వయస్కుడైన నక్సలైట్‌గా కనిపిస్తారని, దేవాదాయ ధర్మాదాయ శాఖలో జరిగే అవినీతిపై పోరాడతారని టాక్‌.  కొరటాల శివ టేకింగ్‌, చిరంజీవి నట విశ్వరూపం చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. రామ్‌చరణ్‌ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. కాజల్‌ హీరోయిన్. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.

‘ఆచార్య’ తర్వాత చిరు ముందు రెండు సినిమాలు ఉన్నాయి. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘లూసిఫర్‌’ రీమేక్‌లో తాను నటిస్తానని చిరు ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించే బాధ్యతను యువ కథానాయకుడు సుజీత్‌కు అప్పగించారు. అయితే, సుజీత్‌ చెప్పిన మార్పులు చిరుకు నచ్చకపోవడంతో సినిమా నుంచి ఆయనను తప్పించినట్లు తెలుస్తోంది. ఆ అవకాశం వి.వి.వినాయక్‌ అందుకున్నారని సమాచారం. వీరి కాంబినేషన్‌లో ఇప్పటికే ‘ఠాగూర్‌’, ‘ఖైదీ నంబర్‌ 150’ చిత్రాలు వచ్చాయి. ఈ రెండూ రీమేక్‌ చిత్రాలే. ఇప్పుడు ‘లూసిఫర్‌’కు దర్శకత్వం వహిస్తే ముచ్చటగా మూడో సినిమా అవుతుంది. ఇందులోనూ రామ్‌చరణ్‌  ఓ కీలక పాత్ర పోషిస్తారని సమాచారం. మాతృకలో పృథ్వీరాజ్‌ సుకుమార్‌ లేదా టోవినో థామస్‌ పోషించిన పాత్రల్లో ఏదో ఒకటి చేస్తారని టాక్‌.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios