స్టార్ హీరోల బర్త్ డేలు అంటే.. ప్యాన్స్ ఆశగా ఎదరు చూస్తుంటారు. అభిమానుల కోసం స్టార్ హీరో ఏం ప్లాన్ చేశారా అని...? ఇక రేపు( అగస్ట్ 22) మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కోసం భారీ ట్రీట్ ను రెడీ చేస్తున్నార.
స్టార్ హీరోల బర్త్ డే వచ్చిందంటే చాలు.. ఫ్యాన్స్ హడావిడి మామూలుగా ఉండదు. ఆ స్టార్ హీరో సినిమాలు ఏవైనా పెండింగ్ ఉంటే.. ఆమూవీ నుంచి అప్ డేట్ ఇవ్వాలంటూ డిమాండ్లు వస్తుంటాయి. ఏ సినిమా సెట్స్ లో లేకపోతే.. కొత్త సినిమా ప్రకటనల కోసం ఎదురు చూస్తుంటారు ఫ్యాన్స్. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి పరిస్థితి అదే. రేపు ( అగస్ట్ 22) మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా.. ఆయన కొత్త సినిమాలు ఏవైనా ప్రకటిస్తారేమో అని.. ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వరుస పరాజయాలతో ఇబ్బందుల్లో ఉన్న చిరు ఏం చేస్తాడా అని అంతా ఎదరు చూస్తున్నారు.
అయితే మెగాస్టార్ తన భర్త్ డే సందర్భంగా రెండు సినిమాలు ప్రకటించబోతున్నారు అన్న న్యూస్ టాలీవుడ్ లో వైరల్ అవుతోంది. చిరంజీవి వరుసగా ఆచార్య.. గాడ్ ఫాదర్.. భోళాశంకర్ సినిమాలను సెట్స్ ఎక్కింది.. ఒక్కోక్కటిగా వాటిని రిలీజ్ చేస్తూ వచ్చారు. అయితే ఈమూడు సినిమాల్లో గాడ్ ఫాదర్ మాత్రమే పర్వాలేదు అనిపించింది. ఇక ఆచార్య, భోళా శంకర్ బోల్తా కొట్టేశాయి. ఇలా వారుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్న మెగాస్టార్ చిరంజీవి నుంచి.. డిఫరెంట్ మూవీని.. అది కూడా సూపర్ హిట్ సినిమాను ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. కాగా ఇప్పుడు మళ్లీ ఆయన మరో మూడు ప్రాజెక్టులను సెట్ చేస్తున్నట్టుగా టాలీవుడ్ లో టాక్ గట్టిగా వినిపిస్తోంది.
ముఖ్యంగా ఎప్పటి నుంచో.. బింబిసార దర్శకుడు శ్రీవశిష్ఠ చిరంజీవితో సినిమా చేస్తాడంటూ ఓన్యూస్ వైరల్ అవుతోంది. వీరిద్దరి కాంబోలో ఒక ఫాంటసీ మూవీని ప్లాన్ చేస్తున్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. అంతే కాదు మరో వైపు కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో కూడా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాను చేయబోతున్నట్టుగా మరో న్యూస్ వైరల్ అవుతోంది. అయితే ఈ రెండు సినిమాలకు సబంధించిన ప్రకటను. రేపు చిరంజీవి బర్త్ డే సందర్భంగా అనౌన్స్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.
అంతే కాదు ఈ సారి మెగాస్టార్ చిరంజీవి కాస్త రూటు మార్చారు.. అటు రజినీకాంత్, ఇటు బాలయ్య మాదిరిగా.. యంగ్ డైరెక్టర్స్ కు ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. అందులో భాగంగా.. ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ తో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేయబోతున్నట్టు సమాచారం యువ దర్శకులకు చిరంజీవి ఒకే సమయంలో ఛాన్స్ ఇవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది. మరోవైపు మరికొంత మంది దర్శకులు కూడా చిరంజీవి కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా తమిళ దర్శకుడు మురుగదాస్.. కథతో చిరంజీవి కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. మురగదాస్ తో కూడా సినిమా ఉంటుందని.. కాకపోతే దానికి కాస్త టైమ్ పట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం.
