వరుస సినిమాలతో.. దూసుకుపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. యంగ్ స్టార్స్ తో పోటీపడుతూ..దూసుకుపోతున్నాడు చిరు. ఇక తాజాగా బోళాశంకర్ షూట్ లో బిజీగా ఉన్న మెగాస్టార్.. సినిమాను అతి త్వరలో కంప్లీట్ చేయబోతున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి జోరుమీదున్నారు. ఈమధ్యే సెకండ్ ఇన్నింగ్స్‌లో వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ ను సాధించాడు మెగాస్టార్ చిరంజీవి. అదే జోరును కొనసాగిస్తూ ప్రస్తుతం భోళా శంకర్ సినిమాతో మరో సూపర్ హిట్ అందుకోవాలి అని చూస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తమిల సినిమా వేదాళమ్ కు రీమేక్ గా తెరకెక్కుతోంది. ఇక ఈమూవీలో చిరంజీవి కాస్త డిఫరెంట్ గా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.
ఇక ఈసినిమాల్ మెగా జోడీగా.. చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది.
ఇక ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ మెగాస్టార్ చెల్లెలి పాత్ర పోషిస్తుండగా... సుశాంత్, మురళి శర్మ, రవి శంకర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సుశాంత్ జోడీగా.. కీర్తి నటిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ మూవీ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గాజరుగుతోంది. భోళా శంకర్ షూటింగ్ దాదాపు క్లైమాక్స్ కు వచ్చినట్టు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవికి సబంబంధించిన ఇంపార్టెంట్ సీన్స్ ను తెరకెక్కిస్తున్నారట టీమ్.
ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశాలను మెహర్ రమేశ్ చిత్రీకరిస్తున్నారు. హైదరాబాద్ మూసాపేట ప్రాంతంలో వేసిన సెట్ లో కొన్ని రోజులుగా క్లైమాక్స్ సీన్స్ చేస్తున్నట్టు సమాచారం. ఇక ఈ షూటింగ్ రాత్రి పూట చేస్తున్నట్టు సమాచారం. చిరంజీవితో పాటు కీర్తి సురేష్, సుశాంత్, మురళీ శర్మ, రవి శంకర్ తదితరులు షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఆగస్టు 11న సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్నట్టు తెలుస్తోంది.
