మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ చిత్రంఆగష్టు 11న విడుదలై ఎంతటి దారుణ పరాజయాన్ని మూటగట్టుకుందో అందరికి తెలిసిందే. ఈ మూవీపై సోషల్ మీడియాలో రిలీజైనప్పటి నుంచి ట్రోలింగ్ జరుగుతూనే ఉంది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ చిత్రంఆగష్టు 11న విడుదలై ఎంతటి దారుణ పరాజయాన్ని మూటగట్టుకుందో అందరికి తెలిసిందే. ఈ మూవీపై సోషల్ మీడియాలో రిలీజైనప్పటి నుంచి ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేదు. మెగా ఫ్యాన్స్ కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు.
ఒక రీమేక్ చిత్రాన్ని ఎంచుకోవడం చిరంజీవి చేసిన మొదట తప్పు అయితే.. మెహర్ రమేష్ ని డైరెక్టర్ గా పెట్టడం రెండవ తప్పు అని ఫ్యాన్స్ అంటున్నారు. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరుకి భోళా శంకర్ రూపంలో ఊహించని షాక్ ఎదురైంది. రీమేక్ చిత్రాలకు కాలం చెల్లింది అని భోళా శంకర్ ద్వారా అర్థం అయింది. మూసపద్ధతిలో ఎన్ని కమర్షియల్ హంగులు జోడించిన ఉపయోగం ఉండదు అని తేలింది.
ఇదిలా ఉండగా భోళా శంకర్ చిత్రం మరోసారి ఆడియన్స్ ని పలకరించేందుకు రెడీ అవుతోంది. నెట్ ఫ్లిక్స్ ఓటిటి లో ఈ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. ఈ మేరకు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయింది. సెప్టెంబర్ 15న భోళా శంకర్ చిత్రం నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ మొదలు కానుంది.
కొన్ని చిత్రాలు థియేటర్స్ లో నిరాశపరిచినప్పటికీ ఓటిటిలో అదరగొడతాయి. కానీ భోళా శంకర్ పై మాత్రం అలాంటి ఆశలు ఏమీ లేవు. ఈ చిత్రంపై ఎవ్వరూ ఆసక్తి చూపడం లేదు. ఏది ఏమైనా చిరు భోళా శంకర్ డిజాస్టర్ నుంచి బౌన్స్ బ్యాక్ కావాలని ఆడియన్స్ కోరుకుంటున్నారు. చిరు తదుపరి బింబిసార డైరెక్టర్ మల్లిడి వసిస్ట్ దర్శకత్వంలో ఉండబోతోంది.