ముచ్చింతల్ లోని మహా సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకోవడానికి సెలబ్రిటీలు క్యూ కడుతున్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా స్టాపించిన ఆశ్రమాన్ని మెగాస్టార్ సందర్శించారు.
ముచ్చింతలో లోని మహా సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకోవడానికి సెలబ్రిటీలు క్యూ కడుతున్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా స్టాపించిన ఆశ్రమాన్ని మెగాస్టార్ సందర్శించారు.
ముచ్చింతల్ లోని శ్రీ రామానుజ సమతామూర్తి సన్నిధిని మెగాస్టార్ చిరంజీవి దర్శించుకున్నారు. తన సతీమణి సురేఖతో కలిసి ముచ్చింతల్ కు వెళ్లారు. ఆశ్రమానికి విచ్చేసిన చిరంజీవి దంపతులకు చినజీయర్ స్వామి ఆశీర్వచనాలు పలికారు. సమతామూర్తి ప్రతిమను చిరంజీవికి అందించారు.
అంతకు ముందు మెగాస్టార్ సతీమణితో కలిసి సమతా మూర్తిని దర్శించుకున్నారు. దానితో పాటు ఆశ్రమంలో ఉన్న 108 దివ్య దేశాల దేవాలయాలను కూడా చిరంజీవి దర్శించుకున్నారు. ఆశ్రమంలో చాలా సేపు గడిపిన మెగాస్టార్ స్వామి వారి ఆశీస్సులు తీసుకుని.. సమతా మూర్తి గురించి.. చిన్న జియర్ సేవల గురించి కొనియాడారు.
కొన్ని రోజుల క్రితమే చిరంజీవి సోదరుడు, జనసేనాని పవన్ కల్యాణ్ సమతామూర్తిని దర్శించుకున్నారు. రామానుజుల వారి గురించి అద్భుతమూన స్పీచ్ ఇచ్చారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పాటు మరికొంత మంది స్టార్స్ ఇప్పటికే ఆశ్రమ దర్శనం చేసుకున్నారు. అటు ప్రధాని దగ్గర నుంచి పెద్ద పెద్ద నాయకులంతా సమతా మూర్తిని దర్శించుకోవడానిక క్యూ కడుతున్నారు. ఈరోజు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సమతామూర్తిని దర్శించుకోవడానికి హైదరాబాద్ విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా 120 కేజీల శ్రీరామానుజ బంగారు విగ్రహాన్ని రామ్ నాథ్ కోవింద్ ఆవిష్కరించనున్నారు.