Asianet News TeluguAsianet News Telugu

#Hanuman..మెగాస్టార్ హనుమంతుడుగా కనిపిస్తారా? ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రకటన

యానిమేషన్‌ సినిమా హనుమాన్‌లోనూ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చాడు. వీటన్నింటినీ చూస్తే హనుమాన్‌లోనూ ఆంజనేయుడి పాత్రలో చిరంజీవి నటించే ఉంటారనే నమ్మకం కలుగుతోంది. 

Megastar Chiranjeevi as Lord Hanuman? in #Hanuman movie jsp
Author
First Published Jan 6, 2024, 8:29 AM IST


 స్టార్ హీరోల సినిమాలతో తలపడబోతోంది తేజ సజ్జా-ప్రశాంత్ వర్మ కాంబోలో వస్తున్న ‘హనుమాన్’ మూవీ. మెల్లిమెల్లిగా ఈ చిన్న సినిమా బజ్ పెరిగిపెద్దదవుతోంది. టీమ్ కూడా ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా పెద్ద సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా మేకర్స్ ప్రమోషన్స్‌లో దూసుకుపోతున్నారు. విడుదల కి ముందే జనాల్లో ఆసక్తి రేపుతోంది హనుమాన్ సినిమా. బుక్ మై షో ఇంట్రెస్ట్‌లు హనుమాన్ సినిమా టాప్‌లో ఉండటాన్ని బట్టి ఈ విషయం అర్ధమవుతోంది. ఇ జనవరి 7న ఆదివారం హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్ హాల్ లో హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది.   సినిమాని మరింత ఆడియన్స్ లోకి తీసుకు వెళ్ళడానికి చిరంజీవి ముఖ్య అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాబోతున్నారు.

అయితే అదే సమయంలో ఈ సినిమాలో చిరంజీవి కూడా కనిపించబోతున్నారని టాక్ మొదలైంది. రీసెంట్ గా  రిలీజయిన ట్రైలర్ క్లైమాక్స్ షాట్ లో ఆంజనేయస్వామి కళ్ళు తెరిచినట్టు సీన్ చూపించారు. అయితే ఆ కళ్ళు చూడడానికి చిరంజీవి కళ్ళలా ఉన్నాయంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీలో హనుమంతుడి పాత్ర కోసం పరమ భక్తుడైన చిరంజీవి రూపాని ఇప్పుడు ఉపయోగించారని చెప్పుకుంటున్నారు. హనుమంతుడి లుక్ అందర్నీ ఆశ్చర్యపరుస్తుందంటూ దర్శకుడు చెప్పుకొచ్చారు. మరి ఆ లుక్ ని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రివీల్ చేస్తారేమో చూడాలి.

చిరంజీవి తన సినీ జీవితంలో మైలురాయిగా నిలిచిన చిత్రాలలో జగదేకవీరుడు అతిలోకసుందరి ఒకటి. ఈ సినిమాలో చిరంజీవి కాసేపు హనుమంతుడిలా కనిపిస్తాడు. అలాగే యానిమేషన్‌ సినిమా హనుమాన్‌లోనూ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చాడు. వీటన్నింటినీ చూస్తే హనుమాన్‌లోనూ ఆంజనేయుడి పాత్రలో చిరంజీవి నటించే ఉంటారనే నమ్మకం కలుగుతోంది. అయితే ఇది నిజమా? రూమరేనా అన్నదాంట్లో మాత్రం క్లారిటీ రాలేదు. హనుమంతుడి పాత్రలో ఎవరు నటించారనే విషయాన్ని దర్శకుడు ప్రశాంత్‌ వర్మ కూడా రివీల్‌ చేయలేదు. ఆ పాత్ర చేసింది ఎవరో సినిమా చూసే తెలుసుకోవాలన్నాడు.

ఇక ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా, వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రం ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ మొదటి చిత్రంగా వస్తుంది. ఇది సూపర్ హిట్ అవుతే.. ఈ యూనివర్స్ లో మొత్తం 12 సూపర్ హీరోల సినిమాలు రాబోతున్నాయి. కాగా ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు వరల్డ్ వైడ్ గా శ్రీలంక, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా, స్పెయిన్, జర్మనీ.. ఇలా అనేక కంట్రీస్ లో మొత్తం 11 భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios