Asianet News TeluguAsianet News Telugu

మొన్న నాగార్జున.. నిన్న చిరంజీవి గట్టిప్లానే వేశారుగా, అనుకుని చేశారా..? లేక యాదౄచికమా..?

మొన్న నాగార్జున.. నిన్న చిరంజీవి. భలే ప్లాన్ వేశారు. ఒకరు అన్నారని మరొకరు అన్నారా..? లేక ఇద్దరూ అనుకుని ఈ పని చేశారో తెలియదు కాని.. ఒకరిసినిమా గురించి మరొకరు మర్యాదపూర్వంకంగా ప్రమోట్ చేసుకన్నారు. 
 

Megastar Chiranjeevi and Nagarjuna promoted their films
Author
First Published Sep 29, 2022, 1:35 PM IST


నిన్న (18 సెప్టెంబర్ ) మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫారద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపూర్ లో గ్రాండ్ గా జరిగింది. వర్షం కారణంగా ఈవెంట్ కాన్సిల్ అవుతుంది అనుకున్నా.. ఆ జోరువానలోనే మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయ స్పీచ్ ఇచ్చారు. ఈ స్పీచ్ లో భాగంగా తన గాడ్ ఫాదర్ సినిమా రిలీజ్ గురించి మాట్లాడుతూ.. విజయాల పండగ విజయదశమిరోజు అక్టోబర్ 5న గాడ్ ఫాదర్  సినిమా రిలీజ్ అవుతుందని.. ఈసినిమాను ఆదరించమని ఆడియన్స్ ను.. అభిమానులను వేడుకున్నారు. 

ఈ క్రమంలోనే మెగాస్టార్ అదే రోజ  రిలీజ్ అవుతున్న సినిమాల గురించి కూడా మాట్లాడారు. అదే రోజు తన మిత్రడు, శ్రేయోబిలాషి, తన మనసుకు దగ్గరైన వక్యక్తి.. టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున నటించి ఘోస్ట్ సినిమా రిలీజ్ అవుతుందని. ఈ సినిమాతో పాటు ఆసినిమాను కూడా ఆదరించాలని.. మన  సినిమాతో పాటు ఆ సినిమాలు కూడా విజయ దశమి రోజు విజయం సాధించాలని కోరకుంటున్నట్టు మెగాస్టార్ మాట్లాడారు. 

సరిగ్గా నాలుగైదు రోజులు ముందు నాగార్జున కూడా సేమ్ టూ సేమ్ ఇవే పదాలు ఉపయోగించాడు.కర్నూలు లో జరిగిన ఘోస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన నాగార్జున. తన కుటుంబాన్ని ఇంతకు ముందులాగానే తమను ఆదరించాలని. ఘోస్ట్ సినిమా అక్టోబర్ 5న రిలీజ్ అవుతుంది.. మీకు నచ్చిన్టు గా ఈసినిమాలో నేను కనిపిస్తాను.. ఆదరించండి అన్నారు. అంతే కాదు ఇదే రోజు తన ఆత్మీయుడు, స్నేహితుడు.. మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ కూడా రిలీజ్ అవుతుంది.. ఈ సినిమాతో పాుట ఆసినిమా కూడా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నట్టు నాగ్ అన్నారు. 

ఇద్దరు అనుకుని చేశారా..? లేక యాధౄచికంగా జరిగిందా తెలియదు కాని.. ఇద్దరు స్టార్ హీరోలు ఒకేలా ఆలోచించారు. ఇద్దరు ఒక రిలీజ్ డేట్ ను సెలక్ట్ చేసుకోవడమ కాకుండా.  ప్రీ రిలీజ్ ను కూడా ఒకే ప్రాంతం అది కూడా రాయలసీమలోని పక్క పక్క జిల్లలలో జరుపుకున్నారు ఘోస్ట్ ప్రిరిలీజ్ కర్నూల్ లో జరిగితే.. గాడ్ ఫాదర్ ఈవెంట్ అనంతపురంలో గ్రాండ్ గా జరిగింది. ఇక ఇద్దరు స్టార్లు తమ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఒకరి సినిమాను మరొకరు గ్రాండ్ గా  ప్రమోట్ చేసుకున్నారు. ఈరకంగా ఫ్యాన్స్ మధ్య ఉద్రిక్తలు లేకుండా ముందు జాగ్రత్త పడ్డారు స్టార్లు. 

ఇలా ఒకరి సినిమాలు మరొకరు ప్రమోట్ చేయడం ద్వారా ఫ్యాన్స్ మధ్య కూడా ఎటువంటి ఉద్రిక్తలు లేకుండా పోటీ తత్వం కాకుండా.. ప్రశాంతంగా రిలీజ్ లు అవుతాయి. ఇక విజయదశమిరోజు పరిస్థితి ఎలా ఉంటుంది. ఏ సినిమా సక్సెస్ అవుతుంది..? ఏ  సినిమా ప్లాప్ లిస్ట్ లోచేరుతుంది అనేదిచూడాలి మరి.  

ఇక వచ్చే నెల 5న దసరా సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్నాయి గాడ్ ఫాదర్ ఘోస్ట్ మూవీస్.   గాడ్ ఫాదర్ మూవీలో  మెగాస్టార్ సరసన నయనతార నటించగా. ఘోస్ట్ లో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ సందడి చేసింది. గాడ్ ఫాదర్ ను మోహన్ రాజా డైరెక్ట్ చేయగా.. ఘోస్ట్ ను ప్రవీణ్ సత్తార్ తెరకెక్కించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios