సారాంశం

మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిరు సినిమా షూటింగ్ పై తాజాగా అప్ డేట్ వచ్చేసింది. ఇంతకీ విషయం ఏంటంటే..? 

వరుసగా ఫెయిల్యూర్స్ ను చూశారు మెగాస్టార్ చిరంజీవి. వాల్తేరు వీరయ్య సినిమా ఒక్కటే కాస్త ఊరటనిచ్చింది. మిగతా సినిమాలన్నీ బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. చివరిగా మెహార్ రమేష్ డైరెక్షన్ లో చిరంజీవి నటించిన బోళా శంకర్ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది. దాంతో మెగాస్టార్ లాంగ్ గ్యాప్ తీసుకుని రీ ఫ్రెష్ అయ్యారు. ఈక్రమంలో తన నెక్ట్స్ సినిమాపై క్లారిటీ కూడా ఇచ్చారు. బింబిసార సినిమాతో హిట్ కొట్టిన యంగ్ డైరెక్టర్ వశిష్టకు అవకాశం ఇచ్చారుమెగాస్టార్. 

మెగాస్టార్ చిరంజీవి- వశిష్ఠ కాంబోలో  మెగా 156 మూవీ తెరకెక్కుతోంది. ఈసినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. అయితే  యూవీవారు  మొదటిసారి చిరు సినిమాను నిర్మిస్తున్నారు. బింబిసార హిట్ తరువాత చిరు.. వశిష్ఠ టేకింగ్ కు ఫిదా అయ్యి ఈ ఛాన్స్ ఇచ్చాడు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా  అనౌన్స్ మెంట్ అవ్వగా. పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. కాని సెట్స్ మీదకు వెళ్లడానికి మాత్రం టైమ్ తీసుకుంది  మెగా మూవీ. 

అసలయితే.. ఈ సినిమా కన్నా ముందు చిరంజీవి..  బంగార్రాజు ఫేమ్..  కళ్యాణ్ కృష్ణతో ఒక సినిమా చేయాలి. మెగా 156 గా ఆమూవీనే రావాల్సి ఉంది. వశిష్టతో చేయాల్సింది మెగా 157  మూవీగా రావాల్సి ఉంది. కాని ఆ సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోవడంతో.. ఈ సినిమానే మెగా 156గా మారింది. ఇక ఈ సినిమాకు విశ్వంభర  టైటిల్ దాదాపు  ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈసినిమాలో చిరంజీవి ముల్లోక వీరుడుగా కనిపించబోతున్నాడని టాక్ నడుస్తోంది. 

అయితే ఎప్పుడో  పూజా కార్యక్రమాలు చేసుకున్న ఈ సినిమా వెంటనే షూటింగ్ స్టార్ట్ కావాల్సి ఉంది. కాని మెగాస్టార్  మోకాలి సర్జరీ కోసం విదేశాలకు వెళ్లడం.. అక్కడ కొన్నాళ్లు రెస్ట్.. ఆతరువాత వరుణ్ లావణ్య పెళ్లి పనులు ఇలా రకరకాల కారణాల వల్ల ఈసనిమా సెట్స్ మీదకు వెళ్లడానికి లేట్ అయ్యింది. వరుసగా  షూట్ వాయిదా పడుతూ వచ్చింది.

ఇక  తాజాగా ఈమూవీ  ఎట్టకేలకు  సెట్స్ మీదకు వెళ్ళింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు.  క్లాప్ బోర్డు ను షేర్ చేస్తూ.. మెగా 156 సెట్ లో కి వచ్చేసింది  అని చెప్పుకొచ్చారు. దాంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ మూవీలో  హీరోయిన్ గురించి ఇంత వరకూ క్లారిటీ రాలేదు. రూమర్స్ మాత్రం బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. ముందు త్రిష అన్నారు.. ఆ తరువాత అనుష్క అన్నారు.  కాని ఇంకా ఎవరిని ఫైనల్ చేయలేదు.  త్రిష ఫైనల్ అవుతుంది అంటున్నారు. 

ఇండస్ట్రీకి వచ్చీ రావడంతోనే మెగా ఛాన్స్ కొట్టేశాడు డైరెక్టర్ వశిష్ఠ.. ఈ సినిమాను  అతను చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడని తెలుస్తోంది. భారీ బడ్జెట్ పెట్టడానికి యూవీ వెనుకాడదని అందరికి తెల్సిందే. మరి ఈసినిమాతో చిరంజీవిని ఎలా చూపించబోతున్నాడు. ఈసారి అయినా హిట్ అందుకుంటాడా లేదు అనేది చూడాలి.